హైదరాబాద్ లో జరగబోయే పిఎం నరేంద్ర మోడీ బహిరంగ సభను విజయవంతం చేయాలి:బిజెపి జిల్లా అధ్యక్షుడు పాయల్ శంకర్.

మండల కేంద్రంలో శనివారం రోజున బిజెపి పోలింగ్ బూత్ అధ్యక్షులు కార్యకర్తలు మండల జిల్లా నాయకులు నిధి సేకరణ కార్యక్రమం బాగంగా నేరడిగోండ మండల భారతీయ జనతా పార్టీ కార్యాలయంలో బీజేపీ జిల్లా అధ్యక్షుడు పాయల్ శంకర్ ప్రారంభించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రతీ ఒక్కనాయకులు కార్యకర్తలు తప్పకుండా నిధి సేకరణలో భాగస్వాములు కావాలని,  ఆన్లైన్ లోనే డబ్బులు చెల్లించి యూటీఆర్ నంబర్ ఆధారంగా రశీదును మండల పార్టీ నాయకుల వద్ద నుండి తీసుకోవాలని సూచించారు. ఇతర పార్టీలు డబ్బులు ఇచ్చి సభలకు జనాలను తరలిస్తారని కానీ కేవలం భారతీయ జనతా పార్టీలో మాత్రమే తమ ప్రియతమ నాయకుని ప్రసంగం వినడానికి డబ్బులు చెల్లించి వస్తారని అన్నారు అనంతరం మండల బీజేపీ పార్టీ కార్యాలయం నుండి అంబేద్కర్ వరకు ర్యాలీగా వెళ్లి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు.రైతులు పాయల్ శంకర్ ని అప్యాయంగా పలకరించిన అనంతరం ఆయనకు పూలమాల శాలువాతో సన్మానించారు.పాయల్ శంకర్  పోరాటం ఫలితంగా దాదాపు 3 సంవత్సరాలుగా రాష్ట్ర టీఆర్ఎస్ ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరితో మరుగున పడ్డా ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన డబ్బులు ఈరోజు తమ ఖాతాల్లో జమా అయ్యాయని సంతోషం వ్యక్తం చేశారు.ఈ కార్యక్రమంలో బిజెపి నాయకులు కార్యకర్తలు రైతులు తదితరులు పాల్గొన్నారు.