– ఐటీగ్రిడ్ ఉద్యోగులను హైకోర్టు ఎదుట హాజరుపర్చిన పోలీసులు
– తమను ఎవరిని అరెస్టు చేయలేదని ఉద్యోగుల వెల్లడి
– ఐటీగ్రిడ్ ఎండీ అశోక్ పిటీషన్‌ను కొట్టివేసిన హైకోర్టు
– నలుగురు ఉద్యోగులను వదిలివేసిన తెలంగాణ పోలీసులు
– ఐటీగ్రిడ్ ఎండీ అశోక్ కోసం సైబరాబాద్ పోలీసుల గాలింపు
హైదరాబాద్, మార్చి4(జనంసాక్షి) : డేటా చోరీ కేసులో ఐటీ గ్రిడ్ ఎండీ అశోక్‌కు హైకోర్టులో చుక్కెదురైంది. తమ సంస్థకు చెందిన నలుగురు ఉద్యోగులను తెలంగాణ పోలీసులు అక్రమంగా నిర్బంధించారంటూ ఐటీ గ్రిడ్స్ డైరెక్టర్ అశోక్ దాఖలు చేసిన పిటిషన్‌ను తెలంగాణ హైకోర్టు కొట్టివేసింది. మరోవైపు తమ అదుపులో ఉన్న ఐటీ గ్రిడ్ నలుగురు ఉద్యోగులను తెలంగాణ పోలీసులు సోమవారం హైకోర్టులో హాజరుపరిచారు. ఈసందర్భంగా తమను పోలీసులు అరెస్ట్ చేయలేదని, విచారణ కోసమే పిలిపించారని వారు న్యాయస్థానంలో చెప్పారు. దీంతో అశోక్ పిటిషన్‌ను ధర్మాసనం కొట్టివేసింది. అశోక్ ఫిర్యాదు మేరకు జడ్జి నివాసంలో జస్టిస్ ఆర్.ఎస్.చౌహాన్, జస్టిస్ షవిూమ్ అక్తర్‌లతో కూడిన ధర్మాసనం ఈ కేసు విచారణ చేపట్టిన
సంగతి తెలిసిందే. ఐటీ గ్రిడ్స్‌కు చెందిన రేగొండ భాస్కర్, ఫణి కడులూరి, గురుడు చంద్రశేఖర్, విక్రమ్‌గౌడ్ రెబ్బాల అనే నలుగురు ఉద్యోగులను తమ ముందు హాజరు పరచాలన్న హైకోర్టు ఆదేశం మేరకు సోమవారం ఉదయం తెలంగాణ పోలీసులు ఇద్దరు న్యాయమూర్తుల ముందు హాజరుపరిచారు. పోలీసుల తరఫున అడ్వకేట్ జనరల్ వాదనలు వినిపించారు. ఉద్యోగులను తాము అదుపులోకి తీసుకోలేదని, కేవలం నోటీసులు మాత్రమే ఇచ్చామని కోర్టుకు వివరించారు. తమను పోలీసులు నిర్బంధించలేదని ఉద్యోగులు హైకోర్టుకు తెలిపారు. దీంతో ఆ నలుగురికీ స్వేచ్ఛ కలిపించాలని తెలంగాణ పోలీసులను ఆదేశిస్తూ హెబియస్ కార్పస్ పిటిషన్‌ను ధర్మాసనం కొట్టివేసింది.
అశోక్ కోసం సైబరాబాద్ పోలీసుల గాలింపు..
పరారీలో ఉన్న ఐటీ గ్రిడ్ ఎండీ దాకవరపు అశోక్ కోసం సైబరాబాద్ పోలీసులు వేట కొనసాగిస్తున్నారు. ఐదు స్పెషల్ టీమ్‌లతో విశాఖపట్నం, విజయవాడ, కావలి, హైదరాబాద్, బెంగళూరులో అతడి కోసం గాలింపు చేపట్టారు. ఏపీ ప్రజల డేటాను ఐటీ గ్రిడ్ సంస్థ అక్రమంగా దొంగిలించి దుర్వినియోగం చేస్తోందంటూ లోకేశ్వర్‌రెడ్డి అనే వ్యక్తి ఇచ్చిన ఫిర్యాదుతో ఈ సంస్థపై సైబరాబాద్ పోలీసులు కేసు నమోదుచేశారు. ఆదివారం ఉదయం సంస్థపై దాడి చేసి నలుగురు ఉద్యోగులను అదుపులోకి తీసుకున్నారు. ఎన్నికల వేళ డేటా చోరీ కేసు ఏపీతో పాటు తెలంగాణలోనూ పొలిటికల్ హీట్ పెంచేస్తోంది. దీనికి కారణం విూరంటే విూరంటూ అన్ని పార్టీలు ఒకరిపై ఒకరు దుమ్మెత్తిపోసుకుంటున్నాయి.
ఇదిలా ఉంటే ఐటీగ్రిడ్ సంస్థకు సంబంధించి తాజాగా సోమవారం ఎస్‌ఆర్ నగర్ పోలీస్ స్టేషన్‌లో మరో కేసు నమోదు అయింది.
హైబిస్ కార్పరస్ పిటీషన్ కొట్టివేత




