హైదరాబాద్,జూలై5(జనం సాక్షి ): ఏపీకి ప్రత్యేక ¬దా అవసరం లేదంటున్న బీజేపికి వ్యతిరేకంగా జగన్, పవన్ కల్యాణ్ ఎందుకు మాట్లాడ్డం లేదని మాజీ మంత్రి శైలజానాథ్ ప్రశ్నించారు. విభజన హావిూలు అమలు చేస్తామన్న కేంద్రంపై వీరు ఎందుకు మాట్లాడరని అన్నారు. ఈ సందర్భంగా గురువారం ఆయన విూడియాతో మాట్లాడుతూ శత్రువు ఎవరో తెలిసి కూడా రాజకీయ పార్టీలు యుద్ధం చేయలేకపోవడం దురదృష్టకరమని అన్నారు. ఏపీని విచ్ఛిన్నం చేసేందుకు బీజేపీ ప్రయత్నిస్తోందని ఆయన విమర్శించారు. రాష్ట్ర ప్రయోజనాల కోసం ప్రతి పార్టీ కాంగ్రెస్ బాటలో నడవాలని శైలజానాథ్ పిలుపు ఇచ్చారు. కాంగ్రెస్ అధికారంలోకి వస్తే తప్ప ప్రత్యేక¬దా సాధ్యం కాదన్నారు. కాంగ్రెస్ మాత్రమే విబజన హావిూలను అమలుచేయగలదన్నారు.




