హోదా ఉద్యమాన్ని అణచివేయడం తగదు

బాబు తీరు దారుణం: మధు

విజయవాడ,జూలై24(జ‌నంసాక్షి): ప్రత్యేక హోదా ఉద్యమాన్ని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అణచి వేయాలనుకోవడం దారుణమని సిపిఎం రాష్ట్ర కార్యదర్శి పి.మధు అన్నారు. హోదా సాధనలో విఫలమైన బాబు ఇతరలు ఆందోళన చేసినా సహించడం లేదన్నారు. హోదా కోసం బంద్‌ చేస్తున్న వైఎస్సార్‌సిపి నాయకులను అరెస్ట్‌ చేయడాన్ని సిపిఎం తీవ్రంగా ఖండిస్తోందన్నారు. మరో నేత బాబూరావుతో కలిసి మంగళవారం ఆయన విలేకరులతో మాట్లాడారు. ఈ విషయంలో చంద్రబాబు తీరును తీవ్రంగా వ్యతిరేకిస్తున్నామన్నారు. ఒక వైపు ¬దా కోసం తాము పోరాడుతున్నామంటూ చెబుతున్న చంద్రబాబు, మరో వైపు పోలీసులతో అరెస్టులు చేయించడం ఏమాత్రం తగదన్నారు. ప్రజాస్వామ్యంలో నిరసన అనేది ఒక హక్కు అని, దాన్ని చంద్రబాబు కాలరాస్తున్నారని ఆయన మండిపడ్డారు. గతంలోనూ చంద్రబాబు ప్రత్యేక ¬దా ఉద్యమాన్ని అణచివేసే ప్రయత్నం చేశారన్నారు. ¬దా అనేది ఆంధ్రుల హక్కు. హోదా ఉద్యమానికి చంద్రబాబు మద్దతు ఇవ్వకపోయినా పర్వాలేదు. కానీ ఉద్యమాన్ని అణచివేసే ప్రయత్నం చేయొద్దు అని మధు విన్నవించారు. చంద్రబాబు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు చంద్రబాబు ఉద్యమాలు చేయలేదా అని ప్రశ్నించారు. అరెస్ట్‌లతో ఉద్యమాన్ని అణచివేస్తామనుకోవడం అవివేకమన్నారు. అరెస్ట్‌ చేసిన వైఎస్సార్‌సిపి నాయకులను వెంటనే విడుదల చేయాలని మధు డిమాండ్‌ చేశారు.

తాజావార్తలు