Tuesday, 3 November 2026

0.5 సంవత్సరాల పిల్లలకు ఒ ఆర్ ఎస్,& జింక్ ట్యాబ్లెట్స్, పంపిణీ.

కోడేరు (జనం సాక్షి) జూన్ 13 కోడేరు మండల పరిధిలోని రాజాపూర్ గ్రామంలో సోమవారం రోజు నుండి వారం రోజుల వరకు పుట్టినప్పటి నుంచి 5 సంవత్సరాల పిల్లలకు ఒ ఆర్ ఎస్,పాకేట్స్, మరియు జింక్ ట్యాబ్లెట్స్ పంపిణీ చేయడం జరిగింది.అదేవిధంగా వర్షాకాలం సమీపిస్తున్న తరుణంలో సీజన్ వ్యదులు రాకుండా ఉండాలంటే మన పరిసరాలను  పరిశుభ్రంగా ఉంచుకోవాలని.మన ఇంటి ముందు మురికి నీరు నిల్వ ఉండకుండా తగు జాగ్రత్తలు తీసుకోవాలని  ఎ ఎన్ ఎం, ఎ,శాంత గ్రామ ప్రజలకు అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో శాంత, ఆశా కార్యకర్తలు, అంగన్వాడీ టీచర్స్ గ్రామ ప్రజలు పాల్గొన్నారు.