న్యూఢిల్లీ: కేంద్ర ప్రభుత్వద్యోగుల కిచ్చే కరువు భత్యాన్ని 10 శాతం పెంచుతూ మంత్రి వర్గం శుక్రవారం ఆమోద ముద్ర వేసింది. దీంతో ప్రస్తుం మున్న డీఏ శాతం 80 శాతం నుండి 90శాతానికి పెరిగింది. ఫలితంగా సుమారు 80 లక్షల మంది ప్రయోజనం పొందనుండగా వీరిలో దాదాపు 50 లక్షల మంది క్రేంద్ర ప్రభుత్వోద్యోగులు, 30 లక్షల మంది పింఛన్ దార్లు ఉన్నారు. ఈ పెంపు ప్రస్తుత ఆర్థిక సంవత్సరం జులై 1వ తేదీ అమలు లోకి వస్తుందని సంబంధిత వార్గాల ద్వారా తెలిసింది. ఈ నిర్ణయంతో ఖజానాపై ఈ ఏడాది రూ.10,879 కోట్లు, 2013-14 ఆర్థిక సంవత్సరం నుంచి ఏటా రూ.6,297కోట్ల మేర భారం పడుతుందని తెలుస్తోంది. ప్రభుత్వం 2010లో ఒకసారి 10శాతం మేర డిఏ పెంచగా, మూడేళ్ళ తర్వాత ఇప్పుడు మళ్ళీ అంతే శాతం డీఏ పెంచింది.




