Monday, 2 November 2026

ఫిబ్రవరి 10లోగా పార్లమెంట్‌లో తెలంగాణ బిల్లు :డీఎన్‌

హైదరాబాద్‌: ఫిబ్రవరి 10లోగా పార్లమెంట్‌లో తెలంగాణ బిల్లు ప్రవేశ పెడతారని పీసీసీ మాజీ అధ్యక్షుడు డి.శ్రీనివాస్‌ ఆశాభావం వ్యక్తం చేశారు. 15వ తేది కంటే ముందే పార్లమెంట్‌ ఉభయసభల్లో మూజువాణి ఓటు తో బిల్లు ఆమోదం పొందుతుందని ఆయన ధీమా వ్యక్తం చేశారు. మానవమాత్రులే కాదు, హరిహరాదులు అడ్డొచ్చినా తెలంగాణ రాష్ట్రాన్ని ఆపలేరన్నారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు న్యాయపరంగా కూడా ఎలాంటి చిక్కులు రావని స్పష్టం చేశారు. తెలంగాణ నిర్ణయం నేపధ్యంలో కాంగ్రెస్‌లో తెరాస విలీనం సరైన మార్గమని సూచించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *