Monday, 2 November 2026

తెలంగాణకే కట్టుబడి ఉన్నాం: దిగ్విజయ్‌సింగ్‌

ఢిల్లీ: తెలంగాణరాష్ట్ర ఏర్పాటుకు కాంగ్రెస్‌ పార్టీ కట్టుబడి ఉందని రాష్ట్ర కాంగ్రెస్‌ వ్యవహారాల ఇన్‌ఛార్జీ దిగ్విజయ్‌సింగ్‌ అన్నారు. ఢిల్లీలో ఆయన మీడియాతో మాట్లాడుతూ సీమాంధ్రులను పట్టించకోంట్లేదన్న భావన సరికాదన్నారు. సీమాంధ్ర ప్రజలకు భత్రద కల్పిస్తామని పేర్కోన్నారు. విద్య, ఉద్యోగ అవకాశాల్లోనూ సీమాంధ్రులకు రక్షణ కల్పిస్తామని వెల్లడించారు. బిల్లును చెత్తబుట్టలో పడేయాలనడం రి కాదన్నారు. రాజ్యసభ రెబల్‌ అభ్యర్థులపై ఈ రోజు మధ్యాహ్నం 3గంటల వరకు వేచి చూస్తామని దిగ్విజయ్‌ పేర్కోన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *