ఢిల్లీ : సీమాంధ్రకు రూ. 10 వేల కోట్ల ప్యాకేజీ ఇవ్వాలని కేంద్రాన్ని కోరినట్లు ఎంపీ జేడీ శీలం తెలిపారు. ఢిల్లీలో ఎంపీ మీడియాతో మాట్లాడుతూ… తెలంగాణపై బీజేపీది డబుల్ గేమ్. సీమాంధ్ర ప్రజలపై బీజేపీకి ఏ మాత్రం ప్రేమలేదు. హైదరాబాద్‌ని యూటీ చేయకుండా బీజేపీయే అడ్డుకుంది. గవర్నర్‌కు శాంతి భద్రతల అంశంపై మేం అభ్యంతరం చెప్పాం. హైదరాబాద్‌లో తటస్థ పరిపాలన ఉండాలని మేం కోరుకుంటున్నామని పేర్కొన్నారు.




