ఢిల్లీ : తెలంగాణ బిల్లుపై బీజేపీ డబుల్ గేమ్ ఆడుతోందని కాంగ్రెస్ ఎంపీ మధుయాష్కీగౌడ్ అన్నారు. బిల్లుపై లోక్‌సభలో ఒకలా, రాజ్యసభలో మరొకలా మాట్లాడుతూ తెలంగాణ ప్రజలను ఆందోళనకు గురిచేస్తుందన్నారు. పూటకో మాట మాట్లాడటం కాకుండా చిత్తశుద్ధితో ఇచ్చిన మాటకు కట్టుబడి తెలంగాణ బిల్లుకు సంపూర్ణ మద్దతివ్వాలని పేర్కొన్నారు.




