Thursday, 5 November 2026

100 రోజులు ఉపాధి పనులు కల్పించాలి

– పంచాయతీరాజ్‌శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు
హైదరాబాద్‌, జులై21(జ‌నం సాక్షి) : అర్హత ఉన్న ప్రతి ఒక్కరికి 100రోజులు ఉపాధి పనులు కల్పించాలని,  ఉపాధి హావిూ పనులను మరింత పెద్ద ఎత్తున చేపట్టాల్సిన అవసరం ఉందని మంత్రి జూపల్లి కృష్ణారావు చెప్పారు. హైదరాబాద్‌ రాజేంద్రనగర్‌లోని  గ్రావిూణాభివృద్ధి సంస్థలో జూపల్లి అధ్యక్షతన ఉపాధి హావిూ కౌన్సిల్‌ సమావేశం జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. స్థానిక ప్రజాప్రతినిధులు, అంధికారులంతా భాగస్వామ్యం అయితేనే లక్ష్యాన్ని చేరుకోగలుగుతామన్నారు. కనీసం 60 శాతం కూలీలకు వంద రోజుల పని కల్పించేలా ప్రణాళికలు రూపొందించాలని అధికారులకు ఆదేశించారు. కొన్ని గ్రామాల్లో 90 శాతం కూలీలకు 100 రోజుల పని కల్పిస్తుంటే, మరికొన్ని గ్రామాల్లో చాలా తక్కువ మందికి పని కల్పిస్తున్నారని చెప్పారు. అన్ని చోట్లా వంద రోజులు పని జరిగేలా చూడాలన్నారు. ఉపాధి డబ్బులను వెంటనే అందించేలా చర్యలు తీసుకోవాలని, డబ్బులు చెల్లింపులు అలసత్వం వహించవద్దని సూచించారు.