Wednesday, 4 November 2026

మహిళ బ్యాంకులో 115 ఉద్యోగాలు!

న్యూఢిల్లీ: కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన మహిళ బ్యాంక్‌ ఏర్పాట్లు చకచక సాగిపోతున్నాయి. నవంబర్‌లో ఈ బ్యాంకును ప్రారంభించాలను  కుంటున్న ప్రభుత్వం దీని కోసం 115మంది ఆఫిసర్‌ స్థాయి సిబ్బంది నియమించుకోవడానికి ప్రత్యేక నోటిఫికేషన్‌ జారీ చేసింది. ఆసక్తి ఉన్న మహిళలు ఈ నెల 30 లోపు ఆన్‌లైన్‌లోనే దరాఖాస్తు చేసుకోవాల్సిఉంటుంది. ఎదైనా యూనివర్సిటీ నుంచి డిగ్రీ పట్టా పొందిన వారు, కంప్యూటర్‌ పై పరిజ్ఞానం ఉన్నవారు మాత్రమే ఈ ఉద్యోగానికి అర్హులని తెలిపింది. మహిళ బ్యాంకును ఏర్పాటు చేయడానికి మూలధన నిధుల కింద రూ.1000కోెట్లు కేటాయిస్తున్నట్లు ఆర్థిక మంత్రి పీ.చిదంబరం బడ్జెట్‌ ప్రసంగంలో పేర్కోన్నారు, తోలి విడతలో ముంబై, ఢిల్లీ, కోల్‌కత్తా, చెన్నై, ఇండోర్‌, గౌహతి, మైసూరు పట్టాణాల్లో ఏర్పాటు చేయనున్న ఈ శాఖలు ఆ తర్వాత దేశ వ్యాప్తంగా ప్రారంభించాలనుకుంటున్నది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *