Wednesday, 4 November 2026

వినామక విమజ్జనంలో అపశృతి

యాదగిరిగుట్ట రూరల్‌: యాదగిరిగుట్ట మండలం ,చిన్న కందుకూర్‌ గ్రామంలో వినయాక నిమజ్జనం సందర్భంగా అపశృతి చోటు చేసుకుంది. గ్రామ సమీపంలోని గోధుమకుంట చెరువులో వినాయకుని నిమజ్జనం చేస్తుండగా ఆలేరు పట్టణానికి చెందిన ఎ.నరసింహులు (39) ప్రమాదవశాత్తూ చెరువులో పడి మృతి చెందాడు. పోలీసులు మృత దేహన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆలేరు ఏరియా ఆస్పత్రికి తరలించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *