11/6/22 photo ఐలమ్మ కుటుంబాన్ని రాజకీయంగా ఆర్థికంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఆదుకోవాలి – టిఆర్ఆర్ఎస్ జిల్లా అధ్యక్షులు సాంబరాజు రవి
ఐలమ్మ కుటుంబాన్ని రాజకీయంగా ఆర్థికంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఆదుకోవాలి – టిఆర్ఆర్ఎస్ జిల్లా అధ్యక్షులు సాంబరాజు రవి జనగామ (జనం సాక్షి )జూన్11: జనగామ జిల్లా కేంద్రంలో ప్రభుత్వ వసతి గృహం నందు తెలంగాణ రజక రిజర్వేషన్ సమితి జనగామ జిల్లా అధ్యక్షులు మరియు రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ సాంబరాజు రవి లక్ష్మి అధ్యక్షతన ముఖ్యఅతిథిగా చిట్యాల రామచంద్రయ్య హాజరై విలేకరుల సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది . ఈ సందర్భంగా జిల్లా అధ్యక్షులు సాంబరాజు రవి మాట్లాడుతూ జనగామ జిల్లాను ఐలమ్మ జిల్లాగా నామకరణం చేసి జిల్లా కేంద్రంలో విగ్రహాన్ని ఏర్పాటు చేయాలని రజకులకు తగిన విధంగా రాజకీయ గుర్తింపు వచ్చే విధంగా ఎమ్మెల్యే ల సీట్లు ఇయ్యలని కోరారు.అఖిల భారతీయ జాతీయ ఉపాధ్యక్షులు మరియు టిఆర్ఆర్ఎస్ రాష్ట్ర ఉపాధ్యక్షులు యాదగిరి మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా అన్ని రాజకీయ పార్టీలు ఐదు అసెంబ్లీ సీట్లు కేటాయించాలని రజక కులస్తుల ను ఎస్సీ జాబితాలో చేర్చే విధంగా తీర్మానం చేయాలని డిమాండ్ చేశారు రాష్ట్ర అధ్యక్షులు గోపి రజక మాట్లాడుతూ పాలకుర్తి అసెంబ్లీ సీట్లను తెలంగాణ రాష్ట్రంలోని అన్ని రాజకీయ పార్టీలు రజకులకు కేటాయించాలని వారు కోరారు రాష్ట్ర ముఖ్య సలహాదారులు నడిమింటి శ్రీనివాస్ మాట్లాడుతూ చాకలి ఐలమ్మ కుటుంబాన్ని ఆర్థికంగా ఆదుకోవాలని అదేవిధంగా రాష్ట్రస్థాయి నామినేటెడ్ పదవి వారి కుటుంబనికి ఇవ్వాలని కోరారు. ఈ సమావేశానికి రాష్ట్ర కార్యవర్గ సభ్యులు ఎదునూరి వీరన్న ఈస్ట్ జోన్ కన్వీనర్ నార్ల గిరి కుమారస్వామి మీడియా సెక్రెటరీ నరేష్ జిల్లా ప్రధాన కార్యదర్శి కొలిపాక రాములు జిల్లా ముఖ్య సలహాదారులు రమేష్ కిష్టయ్య జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ యూత్ ఓరుగంటి శేఖర్ జిల్లా కార్యవర్గ సభ్యులు శ్రీను నాలుగి రమేష్ అంజయ్య ప్రజ్ఞపురం కుమారస్వామి తదితరులు పాల్గొన్నారు.
Attachments area