న్యూఢిల్లీ: సార్వత్రిక ఎన్నికల సందర్భంగా దేశవ్యాప్తంగా అక్రమంగా తరలిస్తూ పట్టుపడిన దాదాపు రూ. 195 కోట్లలో రూ. 118 కోట్లు ఆంధ్రప్రదేశ్‌కు చెందినవే కావడం విశేషం.కేవలం కరెన్సీనే కాదు..26.56 లక్షల లీటర్ల మద్యం, 70 కిలోల హెరాయిన్‌ను కూడా ఎన్నికల కమిషన్ స్వాధీనం చేసుకుంది. వివిధ రాష్ట్రాలలో అక్రమ డబ్బు పంపకం, చట్టవిరుద్ధంగా వోటర్లను ప్రలోభపెట్టడం వంటి నేరాలకు సంబంధించి 11,469 కేసులు నమోదయ్యాయి. సోమవారం వరకు లభించిన అధికారిక వివరాల ప్రకారం ఆంధ్రప్రదేశ్‌లో రూ. 118 కోట్లు, తమిళనాడులో రూ. 18.31 కోట్లు, మహారాష్ట్రలో రూ. 14.40 కోట్లు, యుపిలో రూ. 10.46 కోట్లు, పంజాబ్‌లో రూ. 4 కోట్లు, మరి కొన్ని రాష్ట్రాలలో కొద్దిపాటి సొమ్ము అక్రమంగా తరలిస్తుండగా అధికారులు స్వాధీనం చేసుకున్నారు.
Related