Tuesday, 3 November 2026

నాకు టికెట్ ఇవ్వలేదు: ఆకుల లలిత

హైదరాబాద్: తొలుత ప్రకటించిన జాబితాలో ఉన్న తన పేరు ఇవాళ్టి మలి జాబితాలో ఎందుకు లేదని ఆమె పొన్నాలను ప్రశ్నించారు. తనకు ముందుగా ప్రకటించిన విధంగా టికెట్ ఇవ్వకపోవడంపై రాష్ట్ర మహిళా కాంగ్రెస్ నేత ఆకుల లలిత తీవ్ర అసంతప్తి వ్యక్తం చేశారు. ఇవాళ ప్రకటించిన జాబితాలో తన పేరు లేకపోవడంపై ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. ఓడిపోయే వారికి టికెట్లు ఎందుకిస్తారని ఆమె నిలదీశారు. రేపు తాను నిజామాబాద్(అర్బన్) అసెంబ్లీ స్థానానికి నామినేషన్ వేస్తానని ప్రకటించారు. మహిళలకు 33 శాతం రిజర్వేషన్లు ఇస్తానని రాహుల్‌గాంధీ అన్న మాటలను లలిత గుర్తు చేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *