Friday, 6 November 2026

పోలవరంపై జగన్‌ అసత్యాలు: దేవినేని

విజయవాడ,మే19( జ‌నం సాక్షి ):  పోలవరంపై జగన్‌ అసత్య ఆరోపణలు చేస్తూ రైతులకు ద్రోహం చేయాలని చూస్తున్నారని మంత్రి దేవినేని ఉమ మండిపడ్డారు. పోలవరం ఆగితే సంతోషించేవారిలో జగన్‌ ముందుంటారని అన్నారు. డయాఫ్రంవాల్‌ అంటే తెలియని జగన్‌ ప్రాజెక్టుల గురించి మాట్లాడుతున్నారని విమర్శించారు. వైఎస్‌ హయంలో పోలవరం మట్టిపనుల పేరుతో కోట్లు దోచుకున్నారని ఆరోపించారు. వర్షాభావం తక్కువగా ఉన్నా.. భూగర్భ జలాలను పెంచామని ఈ సందర్భంగా మంత్రి దేవినేని ఉమ తెలిపారు. అందుకే పోలవరంపై జగన్‌ అసత్య ఆరోపణలు చేస్తూ రైతులకు ద్రోహం చేయాలని చూస్తున్నారని మంత్రి దేవినేని ఉమ మండిపడ్డారు. పట్టిసీమ ద్వారా కృష్ణాడెల్టాను కాపాడమాని, వర్షాభావం తక్కువగా ఉన్నా.. భూగర్భ జలాలను పెంచామని ఈ సందర్భంగా మంత్రి దేవినేని ఉమ తెలిపారు.