హైదరాబాద్: సంక్రాంతి రద్దీతో హైదరాబాద్ నుంచి కాకినాడకు 12 ప్రత్యేక రైళ్లు నడుస్తాయని దక్షిణ మధ్య రైల్వే ప్రకటించింది. దీనికి సంబంధించి రేపు ఉదయం ఎనిమిది గంటలకు రిజర్వేషన్ ప్రారంభం అవుతుందని తెలిపారు. 8,10, 12, 14 తేదీల్లో రాత్రి 11:30కి కాచిగూడ- కాకినాడ మధ్య ప్రత్యేక రైళ్లు ఉంటాయి. 9, 11, 13, 15 తేదీల్లో కాకినాడ నుంచి ప్రత్యేక రైళ్లు బయలు దేరుతాయి.




