ఢిల్లీ : పార్లమెంట్ ఉభయసభలు మధ్యాహ్నం 12 గంటలకు వాయిదా పడ్డాయి. రాజ్యసభ సమావేశం ప్రారంభం కాగానే మాజీ సభ్యుడు రాజన్ మృతికి సభ సంతాపం తెలిపింది. అనంతరం స్పీకర్ ప్రశ్నోత్తరాల సమాయాన్ని ప్రారంభిస్తున్నట్లు తెలిపారు. వెంటనే సీమాంధ్ర సభ్యులు వెల్‌లోకి వెళ్లి సమైక్యాంధ్ర నినాదాలతో ఆందోళన చేపట్టారు. రాజీవ్‌గాంధీ హంతకులను వడుదల చేయాలని తమిళనాడు ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ కాంగ్రెస్ ఎంపీలు కూడా ఆందోళన చేపట్టారు. దీంతో సభ సజావుగా నడిచే పరిస్థితి లేకపోవడంతో ఛైర్మన్ సభను మధ్యాహ్నం 12 గంటలకు వాయిదా వేశారు.




