హైదరాబాద్: ఏపీ ముఖ్యమంత్రి సహా 120 మంది ముఖ్య నాయకుల ఫోన్లు ట్యాప్ అయినట్లు తమకు ప్రాథమిక సమాచారం ఉందని మంత్రి పల్లె రఘునాథ్‌రెడ్డి తెలిపారు. కేంద్రంపై ఒత్తిడి తీసుకువచ్చి కేసీఆర్ ఆట కట్టిస్తామన్నారు. నోరు పారేసుకున్న ఏ నాయకుడు కూడా చరిత్రలో బాగుపడిన దాఖలాలు లేవని…కేసీఆర్ నోరే ఆయనకు శత్రువని తప్పుబట్టారు. జగన్, కేసీఆర్ తెలుగు ప్రజల పాలిట రాహు, కేతువులాంటి వారని వ్యాఖ్యానించారు. తనకు కేటాయించిన ఐదుశాఖల్లో ఏడాది పురోగతిని మంత్రి పల్లె సెక్రటేరియట్‌లో వివరించారు.




