కేంద్ర పౌరవిమానయాన శాఖ మంత్రి అజిత్‌సింగ్
హైదరాబాద్, మార్చి 12 (జనంసాక్షి) :
పౌర విమానయానంలో ప్రస్తుతం 13వ స్థానంలో ఉన్న భారతదేశం మూడో స్థానానికి చేరుకోవడమే తమ లక్ష్యమని కేంద్ర పౌరవిమానయాన శాఖ మంత్రి అజిత్‌సింగ్ అన్నారు. అందుకోసం తమ శాఖ కృషి చేస్తోందని ఆయన పేర్కొన్నారు. ఇండియన్ ఏవియేషన్-2014ను బుధవారం ఆయన రాష్ట్ర గవర్నర్ ఈఎస్ఎల్ నరసింహన్‌తో కలిసి బేగంపేట విమానాశ్రయంలో ప్రారంభించారు. ఈ సందర్భంగా నరసింహన్ మాట్లాడుతూ, విమానరంగంలో హైదరాబాద్‌కు ప్రత్యేక స్థానం ఉందని అయితే టెక్నాలజీ పరంగా డెవలప్ కావాల్సిన అవసరం ఉందని అన్నారు. టెక్నాలజీపరంగా ఇంకా మనం వెనకబడే ఉండడం అభివృద్దికి ఆటంకంగా మారిందన్నారు. అత్యాధునిక టెక్నాలజీలో మన దేశం వెనకబడి ఉందని, ఇలాంటి ప్రదర్శనలతో మనదేశానికి గుర్తింపు వస్తుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. శంషాబాద్‌లోని రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం దేశానికే తలమానికమని గవర్నర్ నరసింహన్ కొనియాడారు. మౌలిక వసతుల కల్పనకు ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని కేంద్ర మంత్రి అజిత్‌సింగ్ సూచించారు. 2020 వరకు వెయ్యి విమానాల కొనగోలు చేస్తామని కేంద్రమంత్రి హామీ ఇచ్చారు. బేగంపేట ఎయిర్‌పోర్టులో అంతర్జాతీయ విమాన ప్రదర్శన బుధవారం ప్రారంభమైంది. 18 దేశాలకు చెందిన 250 సంస్థలు ఈ ప్రదర్శనలో పాల్గొంటు-న్నాయి. బేగంపేట విమానాశ్రయంలో ఉదయం ప్రారంభమైన అంతర్జాతీయ విమాన ప్రదర్శనలో విన్యాసాలు ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంటున్నాయి.





