హైదరాబాద్,అక్టోబర్25(జనంసాక్షి): టీఎస్‌ఆర్టీసీ సిటీ ఏసీ పుష్పక్ బస్సుల ద్వారా రాజీవ్‌గాంధీ అంతర్జాతీయ విమానశ్రయం డిపార్చర్ ర్యాంపుల వరకు విమాన ప్రయాణికులు చేరుకోవచ్చని టీఎస్‌ఆర్టీసీ గ్రేటర్ హైదరా బాద్ జోన్ వెల్లడించింది. ఈ మేరకు నగరంలోని ముఖ్యమైన ప్రాంతాల నుంచి బస్సులు అందుబాటులో ఉంటాయని గ్రేటర్ ఆర్టీసీ ఈడీ వినోద్ కుమార్ పేరుతో ఒక ప్రకటన విడుదల చేశారు. ప్రతీరోజు 41 బస్సులు 334 సింగిల్ ట్రిప్పులు, 167 రౌండ్ ట్రిప్పులు తిరుగుతాయని తెలిపారు. పటాన్‌చెరు నుంచి 8, జేఎన్‌టీయూ, కూకట్‌పల్లి నుంచి 10, జేబీఎస్, సికింద్రాబాద్ నుంచి 12, జేబీఎస్ నుంచి పర్యాటక భవన్ నుంచి 5, ఎంజీబీఎస్ నుంచి 6 బస్సులు నడుస్తాయని ప్రకటించారు. ఈ బస్సు లన్నీ నేరుగా ఇంటర్నేషనల్ అండ్ డొమెస్టిక్ డిపార్చర్ ర్యాంపుల వరకు వెళ్ళి ప్రయాణికులను దించి టెర్మినల్ ప్రాంతంలో ఉన్న బస్టాపు నుంచి ప్రయాణికులను ఎక్కించుకుని నగరంలోని గమ్యస్థానాలకు చేరుస్తాయని తెలిపారు. ఇది ఎయిర్‌పోర్టు ప్రయాణికులకు ప్రయోజనకరంగా ఉంటుందని చెప్పారు. గతంలో ఇటువంటి సదుపాయం లేదని తెలిపారు. దీనిని దృష్టిలో పెట్టుకుఇన ప్రయాణికులు వీటిని ఉపయోగించు కోవాలన్నారు.




