రాయవరం: తూర్పు గోదావరి జిల్లా రాయవరం మండలం చెల్లూరు శివారు ఎర్రమట్టిపురంలో విజిలెన్స్ అధికారులు దాడులు నిర్వహించారు. ఈ దాడుల్లో 135 క్వింటాళ్ల రేషన్ బియ్యాన్ని పట్టుకున్నారు. ఎర్రమట్టిపురంలోని ఓ ప్రైవేటు గోదాము వద్ద తరలించేందుకు సిద్దంగా ఉంచిన బియ్యాన్ని స్వాధీనం చేసుకున్నట్లు విజిలెన్స్ సీఐ కె.వి.ఎస్ వరప్రసాద్ తెలిపారు.




