Sunday, 8 November 2026

పల్లవి పాఠశాలలో భరతనాట్య నృత్యా ప్రదర్శన

పాల్గోన్న జాతీయ అంబాసిడర్‌ తేజస్వీని మనోగ్న.

మొయినాబాద్‌

భారతీయ సంస్త్ర్కతిని చాటిచేప్పేది భరతనాట్యమని దీనిపై దేశంలో ఎక్కువ మక్కువ చూపేందుకు కృషి చేయాలని భరత నాట్య జాతీయ అంబాసిడర్‌ తేజస్వీని మనోగ్న పేర్కోన్నారు.మండలంలోని హిమయత్‌ నగర్‌ రెవెన్యూ పరిధిలోని గండిపేట చౌరస్తాలోని పల్లవి ఇంటర్‌ నేషనల్‌ పాఠశాలలో శనివారం సాయంత్రం భరనాట్య నృత్యా ప్రదర్శన కార్యక్రమాన్ని పాఠశాల చైర్మన్‌ మల్కు కొమురయ్య అధ్యక్షతన ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమారనికి ముఖ్యఅతిథిగా భరత నాట్య నృత్యా ప్రదర్శనలో ఉత్తమ ప్రతిభ కనబర్చి అప్పటి రాష్ట్రపతి, ప్రదానమంత్రిల చేతుల మీదుగా ఉత్తమ అవార్డు పెందిన, జాతీయ భరతనాట్య నృత్యా జాతీయ అంబాసిడర్‌ తేజస్విని పాల్గోన్నారు. ఈ సందర్బంగా పాఠశాలలో ఆమె ప్రత్యే భరత నాట్య ప్రదర్శన నిర్వహించారు. అనంతరం ఆమె మాట్లాడుతూ భారతదేశ సంస్త్ర్కతిలో భరతనాట్యం కీలకమైనదని అన్నారు. నేటితరం యువత ఇటువంటి వాటిపై మక్కువ చూపాలని అన్నారు. భరతనాట్యం వల్ల మానసీకరంగా ఎంతో దృడంగా ఉంటామని తెలిపారు. అనంతరం ఆమె పాఠశాల తరపున చైర్మన్‌ కొమురయ్య ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో ప్రిన్సిపాల్‌ నిధిగేర, విద్యార్థులు వారి తల్లిదండ్రులు పాల్గోన్నారు.