జ్యోతి సురేఖది గురుద్రోహం: చీఫ్‌ కోచ్‌

విజయవాడ,మే8(జ‌నం సాక్షి): అంతర్జాతీయ ఆర్చర్‌ జ్యోతి సురేఖ నగదు బహుమానంపై శాప్‌ జారీ చేసిన జీవో వివాదం సద్దుమణిగినా  తాజాగా మరోవివాదం తెరవిూదికొచ్చింది. ఆర్చర్‌ జ్యోతిసురేఖ గురు ద్రోహం చేసిందంటూ చీఫ్‌ కోచ్‌ సత్యనారాయణ, ఆయన సతీమణి నిరసన దీక్ష చేపట్టారు. గుణదలలో కుమారుడు లెనిన్‌ సమాధి వద్ద సత్యనారాయణ, వోల్గా ఆర్చరీ అకాడవిూలో ఆయన భార్య దీక్షకు దిగారు. ఈ సందర్భంగా విూడియాతో మాట్లాడిన సత్యనారాయణ.. జ్యోతి సురేఖ క్షమాపణ చెప్పేవరకు దీక్ష చేస్తామని స్పష్టం చేశారు. సత్యనారాయణకు క్రీడా సంఘాలు, క్రీడాకారులు మద్దతు పలికారు. అయితే ఈ వ్యవహారంపై జ్యోతి సురేఖ ఎలా స్పందిస్తారో వేచి చూడాల్సిందే. ఇప్టపికే ఈ వివాదాన్ని మాజీమంత్రి డొక్కా మాణిక్యవరప్రసాద్‌ జోక్యంతో పరిస్కారం అయ్యింది. 

తాజావార్తలు