పార్టీకి కార్యకర్తలే కీలకం
హైదరాబాద్: పార్టీకి కార్యకర్తలే కీలక వ్యక్తులని టీఆర్‌ఎస్ ఎంపీ వినోద్ అన్నారు. ఇవాళ ఆయన మీడియాతో మాట్లాడుతూ సమస్యలు ఎక్కడున్నా సమాచారమిస్తే అక్కడికక్కడే పరిష్కరిస్తామని స్పష్టం చేశారు. మా ప్రభుత్వం అవినీతి రహిత ప్రభుత్వం. మేం పదవుల కోసం ఉద్యమం నడపలేదన్నారు. 14 సంవత్సరాల సుదీర్ఘ పోరాట ఫలితమే తెలంగాణ రాష్ట్రమని వెల్లడించారు. దేశంలోనే గొప్ప రాష్ట్రంగా తెలంగాణ ఎదగాలంటే ప్రతీ ఒక్కరూ సహకరించాలని విజ్ఞప్తి చేశారు. సమస్యలు ఎక్కడున్నా సమాచారమిస్తే అక్కడికక్కడే పరిష్కరిస్తామని స్పష్టం చేశారు.





