Wednesday, 4 November 2026

15వ లోక్‌సభ రద్దు

న్యూఢిల్లీ : కేంద్ర కేబినెట్ సిఫార్సు మేరకు రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ 15వ లోక్‌సభ రద్దుకు సిఫార్సు చేశారు. లాంఛనంగా 16వ లోక్‌సభ ఏర్పాటుకు కోసం రాష్ట్రపతి ఈ నిర్ణయం తీసుకున్నారు. ‘‘కేంద్ర కేబినెట్ సలహాను రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ అంగీకరించి 15వ లోక్‌సభ రద్దు చేస్తూ జిఓ జారీ చేశారు. రాజ్యాంగంలోని 85వ అధికరణం 2వ నిబంధన, బి ఉప నిబంధన ప్రకారం రాష్ట్రపతి ఈ నిర్ణయం తీసుకున్నారని’ రాష్ట్రపతి భవన్ ప్రెస్ కార్యదర్శి వేణు రాజమోని ఆదివారం ఓ ప్రకటనలో తెలిపారు.ప్రధానిగా వైదొలగనున్న మన్మోహన్ సింగ్ అధ్యక్షతన శనివారం జరిగిన చివరి కేబినెట్ సమావేశం 15వ లోక్‌సభ రద్దునకు సిఫార్సు చేసిన సంగతి తెలిసిందే. కేబినెట్ సమావేశం తర్వాత పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి కమల్‌నాథ్ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీని కలిసి మంత్రివర్గ నిర్ణయ ప్రతిని అంద చేశారు.16వ లోక్‌సభకు జరిగిన ఎన్నికల్లో బిజెపి స్వయంగా ప్రభుత్వ ఏర్పాటుకు అవసరమైన మెజారిటీ సంఖ్యను దాటి 282 స్థానాలు గెలుచుకోగా, కాంగ్రెస్ పార్టీ 44 స్థానాలకు పరిమితమైన సంగతి తెలిసిందే. ప్రధాన ఎన్నికల కమిషనర్ విఎస్ సంపత్ నేతృత్వంలోని ముగ్గురు కమిషనర్ల కేంద్ర ఎన్నికల సంఘం 16వ లోక్‌సభకు కొత్తగా ఎన్నికైన పార్లమెంట్ సభ్యుల జాబితాను రాష్ట్రపతికి అంద చేయనున్నది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *