భద్రాచలం, మే 18: ఖమ్మం జిల్లా భద్రాచలంలోని శ్రీ సీతారామచంద్రస్వామి ఆలయంలో భక్తుల సందడి నెలకొంది. ఆదివారం, అందునా వేసవి సెలవులు కావడంతో రాష్ట్రం నలుమూలల నుంచి భక్తులు భారీ ఎత్తున తరలివచ్చారు. దీంతో ఆలయ ప్రాంగణం కిక్కిరిసింది. వేకువజాము నుంచే భక్తులు పవిత్ర గోదావరిలో స్నానాలు చేసి రామయ్యను దర్శించుకునేందుకు బారులు తీరారు. దీంతో భద్రాద్రి దేవస్థానానికి కేవలం ఆదివారం ఒక్క రోజులోనే రూ.5 లక్షలకు పైగా ఆదాయం సమకూరడం విశేషం.




