సిమ్లా: హిమాచల్ ప్రదేశ్‌లోని కిన్నోర్ జిల్లా రోహత్రంగ్ గ్రామంలో గురువారం ఒక ప్రైవేట్ బస్సులో 400 అడగుల లోతులో ఉన్న లోయలో పడిపోవడంతో కనీసం 15 మంది మరణించారు. మరో 17 మంది గాయపడ్డారు.35 మంది ప్రయాణికులతో సంగ్లా నుంచి కల్పా వెళుతుండగా బస్సు ఈ ప్రమాదానికి లోనైంది. మృతులలో బస్సు డ్రైవర్, కండక్టర్ ఉన్నారు. గాయపడిన 17 మందిని చికిత్స నిమిత్తం ఆస్పత్రిలో చేర్చారు.