Wednesday, 4 November 2026

16 మంది సభ్యుల సస్పెన్షన్‌


లోక్‌సభలో గందరగోళానికి కారణమైన పదహారు మంది సభ్యులను సస్పెండ్‌ చేస్తు న్నట్టు స్పీకర్‌ మీరాకుమార్‌ ప్రకటించారు. వాయిదా అనంతరం లోక్‌సభ మధ్యాహ్నం 2గంటలకు ప్రారంభమయ్యింది. ఇందులో ఉదయం గందరగోళానికి కారణమైన సభ్యులను సస్పెన్షన్‌ చేస్తున్నట్లు ప్రకటించా రు స్పీకర్‌. అనంతరం సభను మధ్యాహ్నం 3 గంటల వరకు వాయిదావేశారు. సమావేశాలు ముగిసేవరకు సభ్యులను సెక్షన్‌ 374(ఎ) ప్రకారం
సస్పెండ్‌ చేసినట్లు స్పీకర్‌ పేర్కొన్నారు. సస్పెండైన వారిలో 14 మంది సీమాంధ్ర, ఇద్దరు తెలంగాణ సభ్యులను స్పీకర్‌ సభనుంచి సస్పెండ్‌ చేశారు. సీమాంధ్ర సభ్యులల్లో ఎస్పీవై రెడ్డి, మాగుంట, ఉండవల్లి, సాయిప్రతాప్‌, అనంత వెంకట్రామిరెడ్డి, రాయపాటి సాంబశివరావు, లగడపాటి రాజగోపాల్‌, సబ్బం హరి (కాంగ్రెస్‌), కొనకళ్ల నారాయణ, నిమ్మల కిష్టప్ప, శివప్రసాద్‌, మోదుగుల వేణుగోపాల్‌రెడ్డి(టిడిపి),  జగన్‌, మేకపాటి (వైకాపా) ఉన్నారు. తెలంగాణ సభ్యులల్లో గుత్తా సుఖేందర్‌రెడ్డి, కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి (కాంగ్రెస్‌) ఉన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *