హైదరాబాద్, ఆగస్ట్ 13 (జనంసాక్షి) : ఈ నెల 17 నుంచి ఎంసెట్ ఇంజినీరింగ్ వెబ్ ఆప్షన్లకు అవకాశం కల్పించనున్నారు. బుధవారం మధ్యాహ్నం ఏపీ ఉన్నత విద్యామండలిలో ఇరురాష్టాల్ర అధికారులు సమావేశమయ్యారు. ఎంసెట్ వెబ్ ఆప్షన్ల తేదీల ఖరారుపై ఈ సమావేశంలో చర్చించి 17 నుంచి వెబ్ ఆప్షన్లు తీసుకోవాలని నిర్ణయించారు. సమావేశానికి ఏపీ, తెలంగాణ సాంకేతిక విద్యాశాఖ కమిషనర్లు హాజరయ్యారు. ఏపీ ఉన్నత విద్యామండలి చైర్మన్ వేణుగోపాల్‌రెడ్డి హాజరుకాలేదు. ఎమ్సెట్ అడ్మిషన్ల కమిటీ సమావేశం తెలంగాణ ,ఆంధప్రదేశ్ ల అధికారులతో కలిసి జరగడం శుభ పరిణామంగా భావిస్తున్నారు. అంతేకాక రెండు రాష్టాల్ర అధికారులు కలిసి విూడియాను ఉద్దేశించి మాట్లాడడం వల్ల విద్యార్థులకు టెన్షన్ తొలగినట్లేనని భావిస్తున్నారు. తెలంగాణలో ఎలా జరగబోతోందో తెలంగాణ అధికారి వివరించారు. ఇంజనీరింగ్ కాలేజీలలో అడ్మిషన్లు ర్యాంకుల వారీగా ఎలా జరుగుతాయో కూడా వారు వివరించారు. దీంతో ఆందప్రదేశ్, తెలంగాణ ఇంజనీరింగ్ విద్యార్ధులకు టెన్షన్ లేకుండా చేసారు. గురువారం నుంచి తెలంగాణలో ధ్రువపత్రాల పరిశీలన ఆరంభమై, 23న ముగుస్తుంది. ఎంసెట్ ర్యాంకు కార్డు, హాల్‌టికెట్, ఇంటర్, ఎస్సెస్సీ మార్కుల మెమోలు, స్టడీ సర్టిఫికెట్లు, ఆదాయ, కుల ధ్రువీకరణ పత్రాల అసలు కాపీలతో పాటు మూడు సెట్ల జిరాక్స్ కాపీలనూ సమర్పించాల్సి ఉంటుంది. పత్రాల పరిశీలనకు సంబంధించిన పూర్తి వివరాలను వెబ్సైట్లో చూడవచ్చు. వికలాంగులు, స్పోర్ట్స్, ఎన్సీసీ తదితర ప్రత్యేక కోటా అభ్యర్థుల ధ్రువపత్రాల పరిశీలన హైదరాబాద్ మాసాబ్‌ట్యాంక్‌లోని సాంకేతిక విద్యాభవన్‌లో మాత్రమే జరుగుతుంది. వెబ్ ఆప్షన్ల నమోదు, సీట్ల కేటాయింపు తేదీలను బుధవారం ఆంధప్రదేశ్ ఉన్నత విద్యామండలితో కలసి చర్చించి ఉమ్మడి కార్యాచరణను ప్రకటించారు. ఈ నెల 31లోగా కౌన్సెలింగ్ తొలిదశ పక్రియను పూర్తిచేసి, మొదటివారంలో తరగతులు ఆరంభిస్తాయి.




