Tuesday, 3 November 2026

సమగ్ర సర్వేపై నివేదిక పంపండి

8

కేంద్ర ¬ంశాఖ 
న్యూఢిల్లీ, ఆగస్టు 13 (జనంసాక్షి) : సమగ్ర సర్వేపై నివేదిక పంపాలని కేంద్ర ¬ంశాఖ ఆదేశించింది. తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టనున్న సమగ్ర కుటుంబ సర్వేపై కేంద్ర ప్రభుత్వం దృష్టిసారించింది. సమగ్ర సర్వేపై నివేదిక ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. సర్వే న్యాయబద్ధమా? కాదా? అనే దానిపై ఆరాతీస్తోంది. సర్వేకు ఉన్న చట్టబద్ధతపై నివేదిక ఇవ్వాలని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి కేంద్ర ¬ం శాఖ కార్యదర్శి అనిల్‌ గోస్వామి లేఖ రాశారు. ఈ అంశం రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించినదే అయిప్పటికీ.. తెలంగాణ కొత్తగా ఏర్పడిన రాష్ట్రమని, ఉమ్మడి రాజధానితో పాటు ఉమ్మడి గవర్నర్‌గా ఒక్కరే కొనసాగుతున్నారని గుర్తుచేశారు. ఇటువంటి పరిస్థితుల్లో కేంద్రం జోక్యం తప్పనిసరి అని తన లేఖలో పేర్కొన్నారు. తెలంగాణ ప్రభుత్వం ఈ నెల 19న సమగ్ర కుటుంబ సర్వే చేపట్టింది. ఒకే రోజు రాష్ట్రవ్యాప్తంగా సర్వే నిర్వహించాలని నిర్ణయించింది. కుటుంబాలకు సంబంధించి పూర్తి వివరాలు సేకరించడం ద్వారా ప్రభుత్వ పథకాల్లో అక్రమాలను అరికట్టి పారదర్శక పాలన అందించాలనే లక్ష్యంతో ప్రభుత్వం ఈ సర్వేకు పూనుకొంది. అయితే, ప్రభుత్వ పథకాలను కుదించే ఉద్దేశ్యంతోనే సర్వే చేపడుతోందని విపక్షాలు ఆరోపించాయి. రేషన్‌కార్డులు, పింఛన్లు వంటి పథకాల భారాన్ని తగ్గించుకొనేందుకు యత్నిస్తోందని విమర్శించాయి. మరోవైపు, తెలంగాణలో నివాసముంటున్న సీమాంధ్రులను వెళ్లగొట్టేందుకే సర్వే నిర్వహిస్తున్నారని ఆంధ్రప్రదేశ్‌ నేతలు ఆరోపిస్తున్నారు. తెలంగాణ ప్రభుత్వం 19న చేపట్టనున్న సర్వే అప్రజాస్వామికమని, సంక్షేమ పథకాల్లో కోత విధించేందుకు సర్వే నిర్వహిస్తోందని టీడీపీ ఎంపీలు ఆరోపించారు. ఈ మేరకు సీమాంధ్ర టీడీపీ ఎంపీలు సుజనాచౌదరి, సీఎం రమేశ్‌ సహా పలువురు బుధవారం ¬ం శాఖ ఉన్నతాధికారులను కలిసి ఫిర్యాదు చేశారు. సర్వే రోజున ప్రజలంతా ఇళ్లవద్దే ఉండాలని చెప్పడంతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని పేర్కొన్నారు. కేంద్ర ప్రభుత్వం నిర్వహించే గణనకు సంబంధించిన వివరాలపై రాష్ట్ర ప్రభుత్వం సర్వే నిర్వహించడం సరికాదని తెలిపారు. ఇలా పలు పార్టీలు, ప్రజాప్రతినిధుల నుంచి ¬ం శాఖకు ఫిర్యాదులు అందాయి. ఈ నేపథ్యంలోనే కేంద్ర ప్రభుత్వం సమగ్ర సర్వేపై దృష్టిసారించింది. భారతదేశంలో ఏ పౌరుడి నుంచి తమకు ఫిర్యాదు వచ్చినా దానిపై విచారణ జరిపించాల్సిన బాధ్యత కేంద్ర ప్రభుత్వంపై ఉందని ¬ం శాఖ కార్యదర్శి గోస్వామి తెలిపారు. అందులో భాగంగానే సమగ్ర సర్వేపై రాష్ట్ర ప్రభుత్వాన్ని వివరణ కోరినట్లు ఆయన స్పష్టం చేశారు. రాష్ట్ర ప్రభుత్వ వివరణ ఆధారంగా సమగ్ర సర్వేపై కేంద్ర ప్రభుత్వ వైఖరిని స్పష్టం చేస్తామని తెలిపారు. 


Leave a Reply

Your email address will not be published. Required fields are marked *