Tuesday, 3 November 2026

భారత వాయు సేనలోకి సి-17 గ్లోబ్‌ మాస్టర్‌

న్యూఢిల్లీ: భారత వాయుసేనా ఈ రోజు మరో సాధనాన్ని సమకూర్చుకుంది. యుద్ధ ట్యాంకుల వంటి భారీ ఆయుధాలను సరిహద్దు ప్రాంతాలకు తరలించేందుకు తోడ్పడే సీ-17 అనే భారీ రవాణా వాహనం భారత వాయుసేన అమ్ములపొదిలో చేరింది. ఉత్తరప్రదేశ్‌లోని హిండెన్‌ బేస్‌నుంచి ఈ విమానం ఈ రోజు టెస్ట్‌ ఫ్లైట్‌తో గగన తలానికి ఎగిరింది. 80 టన్నుల బరువు మోయగల ఈ బోయింగ్‌ గ్లోబ్‌ మాస్టర్‌ విమానాలు పదింటిని 5.1బిలియన్ల ఖరీదుతో భారత వాయుసేన అమెరికా నుంచి కొనుగోలు చేసింది. మూడింటిని యూఎస్‌ ఇప్పటికే సరఫరా చేయగా ఈ ఏడాది చివరికి మరో రెండు అందించనుందని వాయుసేన అధికారులు తెలిపారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *