Monday, 2 November 2026

1956కు ముందు తెలంగాణలో పుట్టిన వారికే ‘ఫాస్ట్’ : టీ. ప్రభుత్వం

i89xylww
     హైదరాబాద్, జూలై 30 : అంధ్రప్రదేశ్ అభ్యంతరాలను లైట్‌గా తీసుకున్న టీఆర్ఎస్ ప్రభుత్వం 1956కు ముందు నుంచి తెలంగాణలో స్థిరపడినవారికే ‘ఫాస్ట్’ పథకం వర్తిస్తుందని స్పష్టం చేసింది. ఈ మేరకు బుధవారం ఉత్తర్వులు జారీ చేసిన టి. ప్రభుత్వం ఈ పథకం విధి విధానాలు ఖరారు చేసేందుకు ఐదుగురు అధికారులతో కమిటీని నియమించింది. స్థానిక నిర్ధారించే ధృవపత్రాలను రెవెన్యూశాఖ జారీ చేస్తుందని ప్రభుత్వం తెలిపింది.

ఫీజు రిఇంబర్స్‌మెంట్ పేరు మార్చి ‘ఫైనాన్పియల్ అసిస్టెంట్ ఫర్ స్టూడెంట్స్’ పేరుతో కొత్త స్కీమ్‌ను తెలంగాణ ప్రభుత్వం ప్రవేశపెట్టిన విషయం తెలిసిందే.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *