కరీంనగర్, జులై 30 : జిల్లాలోని వేములవాడలో పరిమితికి మించి ఆటోలో స్కూల్ చిన్నారులను తీసుకువెళ్తున్న డ్రైవర్‌ను బుధవారం పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వేములవాడలో కృష్ణవేణి ఈ టెక్నో స్కూల్‌కు చెందిన టాటాఏస్ సెవన్ సీటర్ ఆటోలో ఏకంగా 31 మంది చిన్నారులను తరలిస్తుండగా పోలీసులు పట్టుకున్నారు. ఈ వ్యవహారంలో స్కూల్ యాజమాన్యంపై డీఈవోకు ఫిర్యాదు చేసినట్లు సీఐ దేవేందర్‌రెడ్డి తెలిపారు.




