Tuesday, 3 November 2026

జూన్‌ 2నాటికిి పంపకాలు పూర్తి

  • విభజన వేగవంతం చేయండి
  • గోస్వామి సమీక్ష

హైదరాబాద్‌, మార్చి 19 (జనంసాక్షి) :
తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రాల ఆస్తులు, ఇతర పంపకాలు నిర్దేశిత జూన్‌ 2 నాటికి పూర్తి చేస్తామని కేంద్ర హోం శాఖ కార్యదర్శి అనిల్‌ గోస్వామి తెలిపారు. ఉమ్మడి రాజధాని పరిధి లో అవసరమైన కేంద్ర బలగాలు 12 బెటాలియన్లు హైదరా బాద్‌కి రానున్నట్లు కేంద్ర ¬ంశాఖ కార్యదర్శి అనిల్‌గోస్వామి అధికారులకు వివరించారు. రెండు రాష్ట్రాలు వినియోగిం చుకోవాల్సిన పోలీసు సేవలను గుర్తించాలని, చట్ట ప్రకారం వీటికి వెసులుబాటు లభిస్తుందన్నారు. రెండు రోజుల పర్యట నలో భాగంగా కేంద్ర ¬ం మంత్రిత్వ శాఖ కార్యదర్శి అనిల్‌ గోస్వామి నేతత్వంలోని బృందం మంగళవారం హైదరాబాద్‌ చేరుకున్న సంగతి తెలిసిందే. విభజన నేపథ్యంలో జరుగుతున్న నివేదికలను ఆ బృందం పరిశీలిస్తుంది. అందులోభాగంగా ఇప్పటికే అనిల్‌ గోస్వామి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, గవర్నర్‌ తదితరులను కలసి సంగతి తెలిసిందే. పోలీసు శాఖలోనూ విభజన పక్రియను జూన్‌2 కల్లా పూర్తి చేయాలని కేంద్ర ¬ంశాఖ రాష్ట్ర పోలీసు ఉన్నతాధికారులను ఆదేశించింది. సచివాలయంలో రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి మహంతి, డీజీపీ ప్రసాదరావు, ఇంటిలిజెన్స్‌ డీజీ మహేందర్‌రెడ్డి, రాష్ట్ర ¬ంశాఖ ముఖ్యకార్యదర్శి టి.పి.దాస్‌ సహా ఇతర ఉన్నతాధికార్లతో కేంద్ర ¬ంశాఖ కార్యదర్శి అనిల్‌ గోస్వామి భేటీ అయ్యారు. పోలీసు శాఖకు సంబంధించిన 13 విభాగాలలో రెండు రాష్ట్రాల్లోనూ సరిగా పంపిణీ ఉండేట్టుగా జాగ్రత్త వహించాలన్నారు. పోలీసు విభాగం నిర్వాహణకు ఎంత నిధులు అవసరమవుతాయన్న అంచనాలను కూడా సిద్ధం చేయాలని ఆదేశించారు. పోలీసుశాఖ విభజనలో ప్రధానంగా ముడిపడి ఉన్న వివిధ శిక్షణా సంస్థలు, బెటాలియన్లు, పోలీసు ఆస్తులు, అప్పులు వంటి వాటి విభజన సజావుగా సాగేట్టు చేయాలన్నారు. గ్రేహౌండ్స్‌, ఆక్టోపస్‌ లాంటి వరల్డ్‌ క్లాస్‌ సంస్థలను రెండు రాష్టాల్రు సమర్థంగా కొన్నేళ్లపాటు వినియోగించుకునేట్టు చట్టంలో ఉన్న వెసులుబాటు ప్రకారం ఉంటుందని అనిల్‌ గోస్వామి వివరించినట్టు సమాచారం. పోలీసు సిబ్బంది, అధికారుల విభజన అంశాలను కేంద్ర కమిటీ పర్యవేక్షిస్తుందని స్పష్టం చేశారు.ఉమ్మడి రాజధాని నిర్వహణలో పోలీసులదే కీలకపాత్ర అని కేంద్ర ¬ం శాఖ కార్యదర్శి అనిల్‌ గోస్వామి స్పష్టం చేశారు. అపాయింటెడ్‌ డేట్‌కు ముందే పోలీస్‌ శాఖలో స్పష్టత రావాలని ఆయన తెలిపారు. గ్రేహౌండ్స్‌, ఆక్టోపస్‌ దళాలు కేంద్రం ఆధీనంలోనే పని చేస్తాయని వెల్లడించారు. వాటి నిర్వహణ బాధ్యత కూడా కేంద్రమే చూసుకుంటుందని అనిల్‌ గోస్వామి పేర్కొన్నారు. ఎలాంటి పరిస్థితుల్లోనూ రాష్ట్ర విభజన పక్రియ జూన్‌ మొదటి తేదీ నాటికి పూర్తవుతుందని, రెండో తేదీన రెండు రాష్టాల్రు ఏర్పడతాయని, ఈ గడువు పొడగించే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు. విభజన చట్టం అమలు అత్యంత ప్రాధాన్యాంశమని, ప్రస్తుత వేగం సరిపోదని, దానిని మరింతగా పెంచాలన్నారు. రాత్రింబవళ్లు పనిచేసి, అవసరమైతే అదనపు సిబ్బందిని నియమించుకొని దీనిని పూర్తి చేయాలని ఆయన సూచించారు. రెండు, మూడు నెలల గడువు కావాలని ఏ ఒక్కరు అడగొద్దని పేర్కొన్నారు. ఉద్యోగులు, దస్త్రాల విభజన, నిధుల పంపిణీ, భవనాల కేటాయింపు, ట్రెజరీల విభజన వంటివి యుద్ధప్రాతిపదికన పూర్తి చేయాలని పేర్కొన్నారు. ప్రభుత్వ రంగ సంస్థలు, శిక్షణ సంస్థల వంటి వాటి విభజనలో జాప్యం జరిగినా, అది కొత్త రాష్ట్రం ఏర్పాటుకు అడ్డంకి కాదని పేర్కొన్నారు. విభజనపై సందేహాలకు ఏ మాత్రం తావు లేదని, అన్ని అంశాలకు పునర్వ్యవ్థసీకరణ చట్టంలో సమాధానాలున్నాయని తెలిపారు. చట్ట పరిధిలో లేని అంశాలు ఉంటే తమ దృష్టికి తేవాలని సూచించారు. గతంలో జరిగిన మూడు రాష్టాల్ర విభజన మార్గదర్శకాలను అనుసరించాలన్నారు. ఉన్నతాధికారులు పరస్పర సమన్వయంతో పనిచేయాలని, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఆదేశాలను విధిగా పాటించాలన్నారు. ఏప్రిల్‌ నెలాఖరు నాటికి విభజనకు సర్వంసన్నద్ధం చేస్తామని ఈ సందర్భంగా సీఎస్‌ ప్రసన్నకుమార్‌ మహంతి ఈ సందర్భంగా వెల్లడించారు. అనిల్‌ గోస్వామి, తమ శాఖ అదనపు కార్యదర్శి రాజీవ్‌శర్మ, సహాయ కార్యదర్శి సురేష్‌కుమార్‌లతో కలిసి రెండు రోజుల రాష్ట్ర పర్యటనకు హైదరాబాద్‌కు వచ్చారు. ఉదయం నుంచి రాత్రి వరకు సమావేశాలు, భేటీలతో తీరిక లేకుండా గడిపారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *