20నుంచి పవన్‌ పోరాట యాత్ర

 

శ్రీకాకుళం,మే19( జ‌నం సాక్షి): ఈ నెల 20 నుంచి జనసేన పోరాట యాత్ర ఇచ్ఛాపురం నుంచి ప్రారంభమవుతుందని జనసేన అధినేత పవన్‌కళ్యాణ్‌ తెలిపారు. ఉత్తరాంధ్రలోని మూడు జిల్లాల్లో సుమారు 45 రోజుల పాటు యాత్ర కొనసాగనుంది. అన్ని నియోజకవర్గలో ప్రత్యేక ¬దాపై కవాతు నిర్వహిస్తున్నట్లు జనసేన అధినేత పవన్‌ తెలిపారు. ఈ కార్యక్రమంలో పెద్ద ఎత్తున ప్రజలు, జన సేన కార్యకర్తలు పాల్గొని జయప్రదం చేయాలని పవన్‌ కొరారు.