Wednesday, 4 November 2026

20 ఓవర్లు ముగిసే సరికి టీమిండియా స్కోరు(70/5)

బ్రిస్బేన్: ముక్కోణపు సిరీస్ లో భాగంగా ఇక్కడ ఇంగ్లండ్ తో జరుగుతున్న వన్డే మ్యాచ్ లో 20 ఓవర్లు ముగిసే సరికి టీమిండియా ఐదు వికెట్లు కోల్పోయి 70 పరుగులు చేసింది. 15 ఓవర్లకు రెండు వికెట్లు మాత్రమే కోల్పోయిన టీమిండియా వరుస వికెట్లను కోల్పోయి కష్టాల్లో పడింది.అంబటి రాయుడు (23)పరుగులు చేసి ఐదో వికెట్ రూపంలో వెనుదిరిగాడు. అంతకుముందు శిఖర్ ధావన్(1), అజ్యింకా రహానే(33), విరాట్ కోహ్లీ(4), సురేష్ రైనా(1) పరుగు మాత్రమే చేసి పెవిలియన్ కు చేరారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *