హైదరాబాద్: మధ్యాహ్న భోజనం వికటించి 20 మంది విద్యార్థులు అస్వస్థతకు గురైన సంఘటన రంగారెడ్డి జిల్లా ధరూర్ మండలం నాగారం జిల్లా పరిషత్ పాఠశాలలో జరిగింది. ఎప్పటినుంచో నిల్వ ఉంచిన పప్పు వండడం వల్ల విద్యార్థులు అస్వస్థతకు గురైనట్లు భావిస్తున్నారు. వారిని వికారాబాద్ ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.




