Tuesday, 3 November 2026

పోలీసు శిక్షణలో అపశృతి… మహిళకు తీవ్ర గాయాలు

మెదక్: మెదక్ జిల్లా పుల్కల్ మండలం శివంపేటలో పోలీస్ ట్రైనింగ్ సెంటర్ వద్ద మిస్‌ఫైర్ జరిగింది. పోలీసుల శిక్షణలో ప్రమాదవశాత్తు తుపాకి పేలి పొలం పనులకు వెళ్తున్న చంద్రకళ అనే మహిళా రైతు తలలోకి బుల్లెట్ దూసుకెళ్లింది. తలకు తీవ్ర గాయం కావడంతో బాధితురాలిని హుటాహుటిన ఆసుపత్రికి తరలించారు. చంద్రకళను న్యూ ఉమ్నాపూర్‌కు చెందిన మహిళగా గుర్తించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *