విశాఖపట్నం : అక్రమంగా తరలిస్తున్న 200 కేజీల గంజాయిని పోలీసులు మంగళవారం పట్టుకున్నారు. గంజాయి తరలిస్తోన్న ఇద్దరిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. పోలీసులు తెలిపిన వివరాలిలా ఉన్నాయి… విశాఖపట్నం జిల్లా జి.మాడుగుల మండలం మద్దిచెరువు గ్రామం నుంచి 200 కేజీల గంజాయిని అనకాపల్లికి తరలిస్తుండగా.. సమాచారం అందుకున్న ఎక్సైజ్ అధికారులు పాడేరు మండలంలోని కొత్తూరు ఆలయ సమీపంలో తనిఖీలు నిర్వహించి గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. గంజాయి అక్రమంగా తరలిస్తున్న ఇద్దరు వ్యక్తులను అదుపులోకి తీసుకోవడంతో పాటు గంజాయి తరలిస్తున్న వాహనాన్ని సీజ్ చేశారు.




