2011 ప్రకారం మహిళలకు దక్కే స్థానాలు..

2011లో నర్ణయించిన రిజర్వేషన్లను ఖరారు చేశారు. ఓటర్ల జాబితా సిద్ధం చేసిన అనంతరం వీటిలో మార్పులు చేర్పులు కూడా ఉండే అవకాశముంది. ప్రస్తుతమున్న ప్రకారం పరిశీలిస్తే జడ్పీటీసీలో రాయికల్‌ ఎస్టీ మహిళలకు, ఎస్సీల్లో జగిత్యాల, సారంగాపూర్‌, పెగడపల్లి , కోరుట్ల , మేడిపల్లి , చందుర్తి దక్కే అవకాశముంది. గంగాధర, జమ్మికుంట, ధార్మాపురి, మల్యాల ,ఇబ్రహీంపట్నం, కథలపూర్‌, కోనరావుపేట, ఎల్లాడ్డిపేట, గంభీరావుపేట, ధర్మారం, మంథని ముత్తారం బీసీ మహిళలకు దక్కే అవకాశముంది. బెజ్జంకి, కొడిమ్యాల, మెట్‌పల్లి , బోయినపల్లి , సిరిసిల్ల , ముస్తాబాద్‌, ఇల్లంతకుంట, పెద్దపల్లి జనరల్‌ మహిళలకు దక్కే అవకాశముంది.