గుంటూరు, జనంసాక్షి: జిల్లాలోని తెనాలిలో మద్యం మత్తులో యువకులు వీరంగం సృష్టించి లారీ కిందికి తోసిన ఘటనలో మృతి చెందిన సనీల కుటుంబాన్ని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి నారాయణ ఈ ఉదయం పరామర్శించారు. ఘటన గురించి ఆమె భర్త బాబురావును అడిగి తెలుసుకున్నారు. అందరిముందే అఘాయిత్యానికి పాల్పడ్డ ఈవ్‌టీజర్లను పోలీసులు ఎన్‌కౌంటర్ చేసి ఉండాల్సిందని నారాయణ మండిపడ్డారు.




