Thursday, 5 November 2026

September 2012

జిల్లా వార్తలు

పెద్దాయపల్లిలో హత్య

బాలానగర్‌: మండలంలోని పెద్దాయపల్లి శివారులోని చెన్నంగుల గడ్డ గిరిజన తాండలో ఒక వ్యక్తి దారుణహత్యకు గురయ్యాడు. తాండాకు చెందిన భీక్యానాయక్‌(35) గెర్తు తెలియని వ్యక్తులు హత్య చేశారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

జిల్లా వార్తలు

12 క్వింటాళ్ల రేషన్‌ బియ్యాన్ని పట్టుకున్న గ్రామస్థులు

రేగోండ: పోరగల్లి గ్రామానికి చెందిన డీలర్‌ రేషన్‌ భియ్యాన్ని నల్లమార్కెట్‌కు తరలిస్తుండగా గ్రామస్థులు పట్టుకున్నారు 12 క్వింటాళ్ల బియ్యాన్ని ట్రాలీలో నిన్న రాత్రి తరలిస్తుండగా గ్రామస్థులు దాడి చేసి స్వాదీనం చేసుకున్నారు. డీలర్‌ రమాదేవి కోన్ని నెలలుగా బియ్యం…

వార్తలు

పద్మావతీ అమ్మవారిని దర్శించుకున్న రాష్ట్రపతి ప్రణబ్‌

తిరుమల: రాష్ట్రపతి ప్రణబ్‌ ముఖర్జీ తిరుమత పర్యటన ముగించుకుని తిరుచానూరు చేరుకున్నారు. తిరుచానూరులో ఆయన శ్రీ పద్మావతీ అమ్మవారిని దర్శించుకున్నారు.

కరీంనగర్

పని ప్రారంభించిన రామగుంఢం 7వయూనిట్‌

గోదావరి ఖని: గత 40 రోజులుగా వార్షిక మరమ్మత్తులో ఉన్న రామగుండం ఎన్టీపీసీ 500 మోగావాట్ల ఏడో యూనిట్‌ను ఉత్పత్తి దశలోకి ప్రవేశపెట్టారు. ఈ రోజునుంచి యూనిట్‌ పనిచేయడం ప్రారంభించిందని అధికారులు తెలిపారు.

హైదరాబాద్

హైదరాబాద్‌కు చేరుకున్న ఆజాద్‌

హైదరాబాద్‌: వివిధ కార్యక్రమల్లో పాల్గొనడానికి కేంద్ర మంత్రి, కాంగ్రెస్‌ రాష్ట్ర వ్యవహారాల పర్యవేక్షకుడు ఆజాద్‌ హైదరాబాద్‌కు వచ్చారు. మాజీ మంత్రి షబ్బీర్‌అలీ కుమారై వివాహానికి ఆయన హాజరవుతారు. వినోబాబావే జయంతి సందర్భంగా నల్గొండ జిల్లా భూదాస్‌పోచంపల్లిలో జరిగే కార్యక్రమంలో…

జిల్లా వార్తలు

15తులాల బంగారం-వెండి-చోరీ

శంకర్‌పల్లి: సింగపురంలోని భవానీనగర్‌ కాలనీలో అంజద్‌ అనే వ్యక్తి ఇంటి తాళం పగలగోట్టి దొంగలు చోరీకి పాల్పడినారు. 15తులాల బంగారం, వెండి, చీరలు దొంగతానికి గురైనట్లు బాధితులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఇంట్లో వారందరు హైదరాబాద్‌ ఆస్పత్రికి వెళ్లిన…

వార్తలు

ఎన్డీఏ ప్రధాని అభ్యర్థిగా సుష్మాయే సరియైన వ్యక్తి: బాల్‌థాక్‌రే

న్యూఢిల్లీ: ఎన్టీఏ ప్రధాన మంత్రి అభ్యర్థిగా సుష్మాస్వరాజ్‌ సరియైన వ్యక్తి అని శివసేన అథినేత బాల్‌థాక్‌రే కితాబిచ్చారు. సుష్మాబీజేపీలో జనాకర్షణ  శక్తి ఉన్న వ్యక్తి అని పేర్కొన్నారు. సుష్మా మాట్లాడేతీరు. ఆమె చతురత అందరినీ ఆకర్షస్తుందని అన్నారు.

వార్తలు

నిరుద్యోగ భృతి ప్రారంభించిన యూపీ ప్రభుత్వం

లక్నో: ఉత్తరప్రదేశ్‌ ప్రభుత్వం నిరుద్యోగులకు నెలకు వెయ్యి రూపాయల నిరుద్యోగ భృతి ప్రకటించింది. లక్నోలో నిర్వహించిన భారీ బహిరంగసభలో ముఖ్యమంత్రి అఖిలేశ్‌ ఈ ప్రకటన చేశారు. సమాజ్‌వాది పార్టీ ఎన్నికల వాగ్దానమైన  ఈ పథకం కింద లబ్ధి పొందడానికి…

జిల్లా వార్తలు

రాజపేటలో పాముకాటుతో వ్యవసాయ కూలీ మృతి

రాజపేట: రాజపేటకు చెందిన కె.రాములు(25) అనే వ్యవసాయ కూలీ ఇంట్లో నిద్రిస్తున్న సమయంలో పామెకాటుకు గురై మరణించాడు. పాముకాటుకు గురైన అతన్ని హైదరాబాద్‌ తరలించగా గాంధీ ఆసుపత్రిలో చికిత్స పోందుతూ మృతి చెందాడు.

హైదరాబాద్

తెలంగాణ మార్చ్‌కు సన్నాహక యాత్ర

హైదరాబాద్‌: ఈనెల 30న నిర్వహించ తల పెట్టిన ‘ తెలంగాణ మార్చ్‌’కు సంబంధించి ఆదివారం సన్నాహక యాత్రను నిర్వహించారు. తెలంగాణ రాజకీయ, ప్రజా సంఘాల ఐకాస ఆధ్వర్యంలో హైదరాబాద్‌ ఉస్మానియా విశ్వవిద్యాలయం సమీపంలో మాణికేశ్వర్‌నగర్‌ నుంచి యాత్ర సాగింది.