మండలస్థాయి క్రీడా పోటీలు ప్రారంభం
గంగాధర: మండలంలోని జిల్లా పరిషత్ ప్రాథమిక పాఠశాల మైదానంలో ఈ రోజు గ్రామీణ క్రీడా పోటీలు ప్రారంభమయ్యాయి. రెండు రోజులపాటు జరిగే పోటీల్లో కబడ్డీ, వాలిబాల్, ఖోఖో, అద్లెటిక్స్ వంటి క్రీడలు నిర్వహించనున్నారు.
గంగాధర: మండలంలోని జిల్లా పరిషత్ ప్రాథమిక పాఠశాల మైదానంలో ఈ రోజు గ్రామీణ క్రీడా పోటీలు ప్రారంభమయ్యాయి. రెండు రోజులపాటు జరిగే పోటీల్లో కబడ్డీ, వాలిబాల్, ఖోఖో, అద్లెటిక్స్ వంటి క్రీడలు నిర్వహించనున్నారు.
ఒడిషా: బొగ్గు కుంభకోణానికి సీఎం నవీన్ పట్నాయకే కారణమని కాంగ్రెస్ కార్యకర్తలు ఆ రాష్ట్ర అసెంబ్లీ ఎదుట నిరసన వ్యక్తం చేశారు. అక్కడ ఉదిక్త్ర పరిస్థితులు నెలకొనడంతో కాంగ్రెస్ కార్యకర్తలపై పోలీసులు లాఠీఛార్జి చేశారు. వాటన్ కెనాన్స్ కూడా…
హైదరాబాద్: రాష్ట్రంలో ‘జలయజ్ఞంపై ఈ నెలఖారులోగా ముఖ్యమంత్రికి నివేదిక అందజేస్తామని మంత్రి సుదర్శన్‌రెడ్డి తెలియజేశారు.జలయజ్ఞంపై మంత్రివర్గ ఉపసంఘం భేటీ ముగిసిన అనంతరం మంత్రి మీడియాతో మాట్లాడారు. పర్యావరణ, అటవీశాఖ అనుమతుల జాప్యంతో కొన్ని ప్రాజెక్టుల ద్వారా నీరు ఇవ్వలేకపోతున్నామని…
గంగాధర: మండలంలోని ఆచంపల్లి, గర్శకుర్తి గ్రామాల్లో వివిధ కారణాలతో మృతి చెందిన బాధిత కుటుంబాలను చొప్పదండి ఎమ్మెల్యే సుద్దాల దేవయ్య గురువారం పరామర్శించారు. ప్రమాదవశత్తు కుటుంబ యజమాని చనిపోతే ఆపద్బందు పథకం కింద ఆదుకోవాలని, తక్షన సాయంగా 5వేలు…
హైదరాబాద్: నగరానికి చెందిన ఏరోబిక్స్ నిపుణురాలు దినాజ్ వెర్వత్‌వాలా మరో రికార్డు సాధించారు. ఇప్పటికే 24గంటలు ఏరోబిక్స్ చేసి గిన్నిస్ రికార్డు సాధించిన దినాజ్ ఇవాళ 1800 మంది చిన్నారులతో మూడు నిమిషాల్లో రెండు రికార్డులు సాధించారు. జంప్‌జాక్,…
హైదరాబాద్: ఓబుళాపురం మైనింగ్ కంపెనీ అక్రమాల కేసు దర్యాప్తు అధికారిగా వ్యవహరిస్తున్న సబీఐ అదనపు ఎస్పీ ఆర్.ఎం.ఖాన్ బదిలీ అయ్యారు. ముంబయి ఆర్థిక నేరాల విభాగానికి ఖాన్‌ను బదిలీ చేస్తూ ఉత్తర్వులు జారీ అయ్యాయి. ఆయన స్థానంలో చైన్నై…
దౌలతాబాద్:దొమ్మాట గ్రామస్థులు తాగునీటికి ఇబ్బందిపడుతున్నామని మూడు నెలలుగా అధికారుల దృష్టికి తీసుకెళ్లినా సమస్య పరిష్కరించకపోవటంతో ఎంపీడీవోను గ్రామస్థులు నిలదీశారు. ఆయన 3రోజుల్లో సమస్య పరిష్కరిస్తానని హామి ఇచ్చారు.
దౌలతాబాద్: దీపం పథకం కింద 2008లో 112మందికి మంజూరైన గ్యాస్ కనెక్షన్ల ధ్రువీకరణ పత్రాలను స్థానిక ఎమ్మెల్యే ముత్యంరెడ్డి దౌలతబాద్‌లో పంపీణీ చేశారు. అనంతరం సూరంపల్లి, దొమ్మాట గ్రామాల్లో పారిశుధ్య పనులను పరిశీలించారు.
మెదక్: చేగుంట మండలంలోని కరీంనగర్‌కు చెందిన సాయిలు గత ఫిబ్రవరిలో రోడ్డుప్రమాదంలో మృతి చెందాడు. దీంతో ఆపద్బంధువు పథకం కింద మంజూరైన 50వేల రూనాయాలను ఎమ్మెల్యే ముత్యంరెడ్డి అందజేశారు.
ఢిల్లీ: రెండోసారి వాయిదా పడి మధ్యాహ్నం రెండు గంటలకు ప్రారంభమైన రాజ్యసభ తిరిగి ప్రారంభబైన వెంటనే రేపటికి వాయిదా పడింది. బొగ్గు కుంభకోణంపై విపక్షాల ఆందోళన వరసగా సభ వాయిదా పడడానికి కారణమైంది.