Thursday, 5 November 2026

September 2012

వార్తలు

చంద్రబాబును కలిసిన తెలంగాణ, కాంగ్రెస్‌ ఎంపీలు

ఢిల్లీ: పార్లమెంట్‌ హాలులో టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడును తెలంగాణ కాంగ్రెస్‌ ఎంపీలు కలిశారు.తెలంగాణపై త్వరగా లేఖ ఇవ్వాలని చంద్రబాబును ఎంపీలు కోరారు. దీనికీ చంద్రబాబు సానుకూలంగా స్పందించాడని తెలంగాణ, కాంగ్రెస్‌ ఎంపీలు తెలియజేశారు.

హైదరాబాద్

గాలి బెయిల్‌ నిందితులకు రిమాండ్‌ పొడిగింపు

హైదరాబాద్‌: ఓబులాపురం గనుల కేసులో నిందితుడు గాలి జనార్థన్‌రెడ్డి బెయిల్‌ వ్యవహారంలో అక్రమాలకు పాల్పడిన నిందితులు ఏసీబీ కోర్టు రిమాండ్‌ పొడగించింది. మాజీ జడ్జీ పట్టాభితో సహా ఏడుగురు నిందితులకు కోర్టు ఈ నెల 28 వరకు రిమాండ్‌…

హైదరాబాద్

సాయంత్రం తెలంగాణ జేఏసీ స్టీరింగ్‌ కమిటీ భేటీ

హైదరాబాద్‌: సాయంత్రం 4 గంటలకు తెలంగాణ ఫిలింఛాంబర్‌లో టీజేఏసీ స్టీరింగ్‌ కమిటీ సమావేశం జరుగుతుంది. ఈ సమావేశంలో సెప్టెంబర్‌ 17న నిర్వహించనున్న కరీంనగర్‌ కవాతు, సెప్టెంబర్‌ 30న నిర్వహించే చలో హైదరాబాద్‌ తదితర ఉద్యమ కార్యచరణ గురించి ఈ…

జిల్లా వార్తలు

అక్రమంగా తరలిస్తున్న 400లీటర్ల కిరోసిన్‌ పట్టుకున్నా గ్రామస్తులు

వరంగల్‌: నర్శింహులపేట మండలంలోని దాట్లనుంచి అక్రమంగా తరలిస్తున్న 400లీటర్ల కిరోసిన్‌ డ్రమ్ములను గ్రామస్తులు పట్టుకున్నారు. పట్టుబడిన కిరోసిన్‌ పౌరసరఫరాల అధికారులు విచారణ చేపట్టారు.

హైదరాబాద్

నేటి బులియన్‌ ధరలు

హైదరాబాద్‌: నగరంలో బంగారం ధరలు ఈ విధంగా ఉన్నాయి. 24 క్యారెట్ల స్టాండర్ట్‌ బంగారం ధర రూ.32,200గా ఉంది. 22 క్యారెట్ల బంగారం ధర రూ.29,600లుగా ఉంది. కిలో వెండి ధర రూ.62,240గా ఉంది.

జిల్లా వార్తలు

దుబ్బాక ఐటీఐకి 3.20కోట్లు మంజూరు

మెదక్‌: దుబ్బాక ఐటీఐకి 3.20కోట్లు మంజూరు అయినావి. దుబ్బాక ఐటీఐకి పూర్తి స్థాయిలో ప్రభుత్వం నుంచి అనుమతులోచ్చాయని దీనికి 17మంది సిబ్బందిని నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేసిందని ఎమ్మెల్యే చెరుకు ముత్యం రెడ్డి తెలిపారు.

జిల్లా వార్తలు

ఉద్రిక్తతకు దారితీసిన విద్యార్థి సంఘాల ఆందోళన

వరంగల్‌: వరంగల్‌ జాతీయ సాంకేతిక విద్యాసంస్థ నిట్‌లో ర్యాగింగ్‌ ను ఆరికట్టాలని డిమాండ్‌ వ్యక్తం చేస్తూ విద్యార్థి సంఘాలు చేపట్టిన ఆందోళన స్వల్ప ఉద్రిక్తతకు దారితీసింది. ఏబీవీపీ, టీఎస్‌ఎఫ్‌ ఆధ్వర్యంలో విద్యార్థులు డైరెక్టర్‌ ఛాంబర్‌లోకి దూసుకెళ్లి ఓ అధ్యాపకునిపై…

ఆదిలాబాద్

టేకు దుంగల స్వాధినం

ఆదిలాబాద్‌: ఆసీఫాబాద్‌ క్రాస్‌రోడ్డు నుంచి కాగాజ్‌నగర్‌ మండలం వంకులం ప్రధార రహదారిపై గుండా వ్యాన్‌లో అక్రమంగా తరలిస్తున్న టేకు దుంగలను అటవీశాఖ అధికారులు స్వాధినం చేసుకున్నారు. డ్రైవర్‌ పారిపోగా వ్యాన్‌తోపాటు కలప పట్టుకున్నారు.