Tuesday, 3 November 2026

September 2012

జిల్లా వార్తలు

బురదమయంగా మారిన వీధులను పట్టించుకోవటంలేదని వీధుల్లో వరినాట్లు

వరంగల్‌:నర్శింహులపేట మండలంలోని రేపోని గ్రామంలోని వీధులన్ని అధ్వాన్నంగా మారినాయి. బురదమంగా మారిన వీధుల్లో గ్రామస్తులు వరినాట్లు వేసి నిరసన తెలిపారు. సీసీ రోడ్లు వేయాలని డిమండ్‌ చేశారు.

జిల్లా వార్తలు

బంద్‌ను విజయవంతం చేయాలి:ఏబీవీపీ

వరంగల్‌:నర్శింహులపేట మండలంలోని దంతాలపల్లి ఏబీవీపీ నాయకులు మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వ అవినీతిని నిరసిస్తూ ఈ నెల 4న దేశ వ్యాప్తంగా పిలుపునిచ్చిన విఝయవంతం చేయాలన్నారు. గోడ పత్రికలను విడుదల చేశారు.

జిల్లా వార్తలు

అక్రమంగా ఇసుక తరలిస్తున్న వాహనాలను సీజ్‌ చేసిన పోలీసులు

వరంగల్‌: సుబేదార్‌ పోలీసుస్టేషన్‌ పరిధిలోని అక్రమంగా తరలిస్తున్న 16 ట్రాక్టర్లను సీఐ సురేశ్‌ సీజ్‌ చేశారు. సరైన పత్రాలు లేకుండా తరలిస్తున్న ఈ వాహనాలు తనిఖీల్లో పట్టుబడినాయి. వాహనాలను పోలీస్‌ స్టేషన్‌కు తరలించారు.

జిల్లా వార్తలు

రైతు ఆత్మహత్య

రంగారెడ్డి: షాబాద్‌ మండలంలోని సంకెపల్లి గ్రామానికి చెందిన కుమ్మరి చెన్నయ్య అనే వ్యక్తి ఈరోజు ఉదయం పురుగుల మందు తాగి ఆత్మహత్యకు పాల్పడినాడు. ఆత్మహత్యకు గల కారణాలు ఇంకా తెలియరాలేదు.

వార్తలు

ఇరాన్‌లో భూకంపం

తెహ్రాస్‌: ఇరాన్‌లో తూర్పు ప్రాంతంలో భూకంపం సంభవించింది. రిక్టర్‌ స్కేల్‌ పై దీని తీవ్రత 5.2గా నమోదైంది. క్వేస్‌ పట్టణానికి సమీపంలో భూప్రకంపనలు చోటుచేసుకున్నట్లు ఇరాన్‌ అధికారులు తెలియజేశారు. గత నెలలో ఇరాన్‌లో చోటుచేసుకున్న జంట భూకంపాల ఘటనలో…

జిల్లా వార్తలు

రెండురోజులక్రితం ఆత్మహత్యకు పాల్పడివ్యక్తి చికిత్స పోందుతూ మృతి

రంగారెడ్డి: షాబాద్‌ మండలంలోని బొబ్బిలిగామ గ్రామానికి చెందిన మహబూబ్‌ షరిఫ్‌(40) కడుపు నోప్పి భరించలేక రెండు రోజులక్రితం ఆత్మహత్యకు పాల్పడినాడు. చికిత్సకోసం ఉప్మానియాకు తరలించారు చికిత్స పోందుతూ ఈ రోజు మృతి చెందాడు.

జిల్లా వార్తలు

అక్రమంగా తరలిస్తున్న ఇసుక వాహనాలను పట్టుకున్న రెవెన్యూ అధికారులు

నల్గొండ: వేములపల్లి మండలం లక్ష్మిదేవిగూడెంలో అక్రమంగా తరలిస్తున్న ఇసుక తరలిస్తున్న 8లారీలు, 3ట్రాక్టర్‌లను రెవెన్యూ అధికారులు పట్టుకుని వీటిని పోలీసు స్టేషన్‌కు తరలించారు.

జిల్లా వార్తలు

చెప్యాలలో డెంగ్యూతో బాలుడు మృతి

మెదక్‌: మిరుదొడ్డి మండల కేంద్రంలోని చెప్యాల గ్రామంలో తలారి కృష్ణ(9) అనే బాలుడు డెంగ్యూతో మృతి చెందినాడు. 4రోజుల క్రితం హైదరాబాద్‌లోని ఓ ప్రైవేట్‌ ఆసుపత్రికి తరలించారు. అక్కడ చికిత్స పోందుతూ ఈ రోజు మృతి చెందాడు.

జిల్లా వార్తలు

నవాపేటలో మహిళ ఆత్మహత్య

మహబూబ్‌నగర్‌: నవాపేటలో మండల కేంద్రంలో సత్తెమ్మ(50)అనే మహిళ ఆత్మహత్య చేసుకుంది. అనారోగ్య కారణాలతో ఆత్మహత్య చేసుకున్నట్లు కుటుంబ సభ్యులు తెలిపారు.

కరీంనగర్

రక్తదానం చేసిన ఉపాధ్యాయులు

కరీంనగర్‌: జమ్మికుంటలో సర్వేపల్లి రాధాకృష్ణన్‌ టీచర్స్‌ వాలంటరీ అసోసియేన్‌ ఆధ్వర్యంలో ఈ రోజు 50మంది ఉపాధ్యాయులు రక్తదానం చేశారు. రెడ్‌క్రాస్‌ సోసైటీ సిబ్బంది రక్తాన్ని సేకరించారు.