Thursday, 5 November 2026

September 2012

జిల్లా వార్తలు

గ్యాస్‌పైపులైన్‌ నిర్మాణానికి ఏర్పాట్లు

ఖనాపురం: మండలంలోని 5 ప్రాంతాల్లో గ్యాస్‌ పైపులైన్‌ నిర్మాణానికి ఏర్పాట్లు చేస్తున్నట్లు గుజరాత్‌ పెట్రోనెట్‌ లిమిటెడ్‌ అధికారి హెచ్‌వీఆర్‌ శర్మ తెలిపారు.

జిల్లా వార్తలు

ఈ నెల 25 వరకు ఇంటర్‌ పరీక్ష ఫీజు గడువు

విద్యారణ్యపురి: వచ్చే ఏడాది మార్చిలో జరగనున్న ఇంటర్మిడియట్‌ రెండో సంవత్సరం పరీక్షలు రాసే విద్యార్థులు అపరాధ రుసుం లేకుండా ఈ నెల 25వ తేదిలోగా ఫీజు చెల్లించవచ్చని విద్యాధికారి తెలిపారు.

జిల్లా వార్తలు

ఉపాధి పనులపై అసంతృప్తి వ్యక్తం చేసిన పీడీ

శంకర్‌పల్లి: రైతుల భాగస్వామ్యం లేకుండా వారి పోలాల్లో ఉపాధిహామీ పనుల త్రిపాదనలను సిద్దం చేయరాదని డ్వామ పీడి అనురాధ అన్నారు. పనుల ఎంపికను ఆమె పరిశీలించి అసంతృప్తి వ్యక్తం చేశారు.

జిల్లా వార్తలు

నష్టపరిహారం ఇవ్వలేదంటూ రైతుల ధర్నా

మెదక్‌: ఇప్పటికి పంట నష్ట పరిహారం ఇవ్వలేదంటూ అంకిరెడ్డిపల్లి బందారం గ్రామానికి చెందిన రైతులు, రైతు మహిళలు తమ పాసు పుస్తకాలు పట్టుకుని దుద్దెడ రాజీవ్‌ రహదారిపై రాస్తారోకో నిర్వహించారు.

ఖమ్మం

నిరసన ప్రదర్శన

ఖమ్మం: పీఆర్శిని వెంటనే ప్రకటించాలని డిమాండ్‌ చేస్తూ తెలంగాణ ఉద్యోగులు శనివారం ఖమ్మంలో నిరసన ప్రదర్శన నిర్వహించారు.

కరీంనగర్

మరుగుదొడ్ల నిర్మాణంపై అవగాహన సదస్సు

ఎలిగేడు: ఎంపీడీవో కార్యలయంలో మండలస్థాయి అధికారులకు వ్యక్తిగత మరుగుదొడ్లు నిర్మాణంపై అవగాహన సదస్సు నిర్వహించారు. ఉన్నాతాధికారులు మాట్లాడుతూ 1000 వ్యక్తిగత మరుగుదొడ్లు మంజూరయ్యాయని, అధికారులు లక్ష్య సాధనతో ముందుండి జిల్లాలో ప్రథమస్థానంలో నిలిచేలా కృషి చేయాలన్నారు.

హైదరాబాద్

ఈ నెల ’29న తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ప్రకటన’

హైదరాబాద్‌: ఈ నెల ’29న తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ప్రకటన వస్తుందని మాజీమంత్రి, కాంగ్రెస్‌ పార్టీ సీనియర్‌ నేత శంకర్రావు జోస్యం చెప్పారు. అసెంబ్లీ లాబీలో ఆయన శనివారం టీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యులను ఉద్దేశించి  అన్ని అన్నారు. ఇక తెలంగాణ…

ఆదిలాబాద్

జనాలపైకి దూసుకువచ్చిన ఎద్దు-ఇద్దరికి తీవ్ర గాయాలు

ఆదిలాబాద్‌: జిల్లాకేంద్రంలోని గాంధీనగర్‌ కాలనీలో ఓ ఎద్దు జనాలపైకి దూసుకువచ్చింది. కొమ్ములతో దాడి చేయటంతో ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి. వీరిని జిల్లా కేంద్రంలోని రివమ్స్‌కు తరలించారు. అయితే చికిత్స పోందుతున్న వారిలో ఒకరి పరిస్థితి విషమంగా ఉందని సమాచారం.

హైదరాబాద్

ప్రైవేటు పాఠశాల ఉద్యోగిని ఆత్మహత్యాయత్నం

హైదరాబాద్‌: రాజేంద్రనగర్‌లో ఓ ప్రైవేటు పాఠశాలలో పనిచేస్తున్న ఉద్యోగిని ఆత్మహత్యాయత్నం చేసింది. యాజమాన్యం వేధింపుల కారణాంగా ఉద్యోగిని ఈ ఘటనకు పాల్పడిందని ఆమె బంధువులు పాఠశాల ముందు ఆందోళనకు దిగారు.

హైదరాబాద్

జీవ వైవిధ్య సదస్సును ఎవరూ అడ్డకోవద్ద: ముఖ్యమంత్రి

హైదరాబాద్‌: నగరంలో జరుగునున్న జీవ వైవిధ్య సదస్సును ఎవరూ అడ్డుకోవద్దని ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి కోరారు. రాష్ట్ర ప్రతిష్ఠను పెంచే ఈ సదస్సుకు పార్టీల తోపాటు ప్రజలు సహకరించాలన్నారు, భవిష్యత్‌లో అంతర్జాతీయ ఎలర్జీ, వ్యవసాయ సదస్సులు రాష్ట్రంలో జరగనున్నాయని తెలియజేశారు.…