Wednesday, 4 November 2026

October 2012

వార్తలు

ఆకతాయిల వేధింపులతో డిగ్రీ విద్యార్థిని ఆత్మహత్య

మిర్యాలడూడ: ఆకతాయిల వేధింపులు తాళలేక ఓ డిగ్రీ విద్యార్థిని ఆత్మహత్య చేసుకుంది, నల్గొండ జిల్లా మిర్యాలగూడ సంతోష్‌నగర్‌లోని ఓ కళాశాలలో డిగ్రీ చదువుతున్న విద్యార్థిని హారికను గత కొన్ని రోజులుగా ఆకతాయిలు వేధిస్తున్నారు. క్రమంగా వేధింపులు ఎక్కువవుతుండటంతో భరించలేక…

జాతీయం

ఒడిశాలో నలుగురిని అపహరించిన మావోయిస్టులు

భువనేశ్వర్‌: ఒడిశాలో మివోయిస్టులు మరోసారి రెచ్చిపోయారు. రెండు జిల్లాల నుంచి నలుగురు వ్యక్తులను అపహరించుకుపోయారు. ఒనకడిల్లిలో మహిళ సహ ఇద్దరిని, మల్కాన్‌గిరి జిల్లాలో మరో ఇద్దరిని ఎత్తుకెళ్లారు. అపహరణకు గురైన వారిలో ఓ ప్రాజెక్ట్‌ ఉద్యోగి బి.వి రాంప్రసాద్‌,…

కరీంనగర్

టెహ్రన్‌లో అనారోగ్యంతో మెట్‌పల్లి వాసి మృతి

మెట్‌పల్లి: ఉపాధి కోసం టెహ్రన్‌వెల్లిన మెట్‌పల్లి మండలం జగ్గాసాగర్‌ గ్రామానికి చెందిన మంతెన చిన గంగారాం(53) అనారోగ్యంతో మృతి చెందినట్లు గ్రామస్థులు తెలిపారు. గత 25సంవత్సరాలుగా టెహ్రన్‌లో ఉంటున్న గంగారం 6నెలల క్రితం ఇంటికి వచ్చి కూతురు పెళ్లి…

జాతీయం

షిండేతో ముగిసిన తెలంగాణ మంత్రుల భేటీ

న్యూఢిల్లీ: కేంద్ర హోంమంత్రి సుశీల్‌కుమార్‌ షిండేతో తెలంగాణ మంత్రుల భేటీ ముగిసింది, సమావేశంలో తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుపై షిండేతో మంత్రులు చర్చించినట్లు తెలుస్తోంది. తెలంగాణపై తక్షణమే నిర్ణయం తీసుకోవాలని షిండేను మంత్రులు కోరినట్లు సమాచారం, కాంగ్రెస్‌ సీనియర్‌ నేత…

హైదరాబాద్

తెదేపా తెలంగాణ నేతల భేటీ

హైదరాబాద్‌: ఎన్టీఆర్‌ ట్రన్ట్‌భవన్‌లో తెదేపా తెలంగాణ నేతలు భేటీ అయ్యారు. చంద్రబాబునాయుడు చేపట్టిన ‘ వస్తున్నా.. మీకోసం’ పాదయాత్ర రేపటి నుంచి తెలంగాణ ప్రాంతంలోజరగనున్న నేపథ్యంలో ఏర్పాట్లపై నేతలు చర్చిస్తున్నారు.

కరీంనగర్

కరీంనగర్‌లో అబ్కారీ అధికారుల తనిఖీలు

కరీంనగర్‌: అబ్కారీ అధికారుల తనిఖీలు నిర్వహించారు. తనిఖీల్లో భాగంగా ఆర్టీసీ గరుడ బస్సులో అక్రమంగా తరలిస్తున్న 130 మద్యం సీసాలను అధికారులు స్వాధీనం చేసుకున్నారు. డ్రైవర్‌ను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. బెంగళూరు నుంచి కరీంనగర్‌ బస్సు వచ్చినట్లు తెలుస్తోంది.

జాతీయం

కేంద్ర హోంమంత్రితో తెలంగాణ మంత్రులు భేటీ

న్యూఢిల్లీ: కేంద్ర హోంమంత్రి సుశీల్‌కుమార్‌ షిండేతో తెలంగాణ మంత్రులు భేటీ అయ్యారు, సమావేశంలో తెలంగాణ సమస్యపై చర్చించినట్లు సమాచారం, తెలంగాణపై తర్వగా నిర్ణయం తీసుకోవాలని మంత్రిని కోరినట్లు తెలుస్తోంది.

వార్తలు

ఉగ్రవాదులు, భద్రతాదళాలకు మధ్య ఎదురుకాల్పులు

కాశ్మీర్‌: కాశ్మీర్‌లోని షాలూరా సోపుర్‌లో ఉగ్రవాదులు, భద్రతాదళాలకు మధ్య ఎదురుకాల్పులు జరుగుతున్నాయి. ఈ సంఘటనలో ఇద్దరు లష్కరే తోయిబా ఉగ్రవాదులను పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం.

వార్తలు

ఆర్‌ఎస్‌ఎస్‌ చీఫ్‌ను కలవనున్న నరేంద్రమోడి

నాగ్‌పూర్‌: గుజరాత్‌ ముఖ్యమంత్రి నరేంద్రమోడి ఈరోజు ఆర్‌ఎస్‌ఎస్‌ చీఫ్‌ మోహన్‌ భగవత్‌తో నాగ్‌పూర్‌లో భేటీ కానున్నారు. వచ్చే నెలలో జరిగే గుజరాత్‌ అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో బిజీగా ఉన్న నరేంద్ర మోడీ ఈరోజు ఆ పని మానుకుని నాగ్‌పూర్‌…

వార్తలు

ర్యాగింగ్‌ కేసులో ప్రొఫెసరు అరెస్టు

వడోదర: ఎంఎస్‌ యూనివర్శిటీ ఆఫ్‌ బరోడాకు చెందిన మయూర్‌ గుప్తా అనే ప్రొఫెసరును ర్యాగింగ్‌ కేసులో పోలీసులు అరెస్టు చేశారు. ఆర్కిటెక్చర్‌ విభాగానికి చెందిన ఐదుగురు సీనియర్‌ విద్యార్థులతో పాటు ఆయన కూడా చేరి జూనియర్‌ విద్యార్థిని వేధించినట్లు…