Thursday, 5 November 2026

November 2012

హైదరాబాద్

జిల్లాలకు తాత్కాలిక అధ్యక్షులను ప్రకటించిన పీసీసీ

హైదరాబాద్‌: ఆరు జిల్లాలు, 3 నగరాలకు పీసీసీ పార్టీ తాత్కాలిక అధ్యక్షులను ప్రకటించింది. భూపాల్‌రెడ్డి – మెదక్‌, నరేంద్రయాదవ్‌- శ్రీకాకుళం , కరుణం ధర్మశ్రీ- విశాఖ, రాజశేఖరరెడ్డి-చిత్తూరు. మల్లికార్జునరావు-గుంటూరు, దొంతి మాధవరెడ్డి- వరంగల్‌ జిల్లాలకు, అడపా నాగేంద్రప్రసాద్‌- విజయవాడ,…

వార్తలు

ఇరాక్‌లో కారు బాంబు పేలుడు: 27 మంది మృతి

బాగ్దాద్‌: ఇరాక్‌లో కారు బాంబు పేలిన దుర్ఘటనలో 27 మంది మృత్యువాత పడ్డారు. బాగ్దాద్‌లోని ఆర్మీ దళం కేంద్రానికి సమీపంలో ఈ పేలుడు సంభవించినట్లు సమాచారం, గాయపడిన పలువురిని సమీప ఆస్పత్రులకు తరలించారు.

కరీంనగర్

మరో ఉద్యమానికి టీఆర్‌ఎస్‌ సమర శంఖం

కరీంనగర్‌: తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు కోసం శత విధాల ప్రయత్నించిన టీఆర్‌ఎస్‌ అధినేత కేసీఆర్‌ మరో ఉద్యమానికి సమర శంఖం పూరించారు. పార్టీ కేడర్‌లో ఆత్మస్థైర్యంనింపి ఉద్యమ దిశగా నడిపించేందుకు కరీంనగర్‌లో మేధోమథన సదస్సు ప్రారంభించారు. 10 జిల్లానుంచి…

ఆదిలాబాద్

కాగజ్‌నగర్‌ : పట్టణంలోని సిర్పూర్‌ పేపరు మిల్లులో విద్యుత్‌ కోత

కాగజ్‌నగర్‌ : పట్టణంలోని సిర్పూర్‌ పేపరు మిల్లులో విద్యుత్‌ కోత కారణంగా ఈ రోజు సాయంత్రం 6గంటలు నుంచి రాత్రి 10 గంటలు వరకు మిల్లులోని 4,5,6, పేపర్‌ మిషన్ల నుంచి పేపరు ఉత్పత్తిని నిలిచివేయనున్నట్లు యాజమాన్యం ప్రకటించింది.…

జాతీయం

ఒబామాకు రాష్ట్రపతి, ప్రధాని శుభాకాంక్షలు

ఢిల్లీ: నల్లసూరీడు బరాక్‌ ఒబామా తెల్లకోటలో మళ్లీ పాగవేయడంపై భారత్‌ హర్షం వ్యక్తం చేసింది. అమెరికా అధ్యక్షుడిగా రెండోసారి గెలుపొందిన బరాక్‌ ఒబామాకు భారత రాష్ట్రపతి ప్రణబ్‌ ముఖర్జీ, ప్రధాన మంత్రి మన్మోహస్‌సింగ్‌లు శుభాకాంక్షలు తెలియజేశారు.

హైదరాబాద్

నేటి బులియన్‌ ధరలు

హైదరాబాద్‌: నగర బులియన్‌ మార్కెల్లో బంగారం ధరలు ఈ విధంగా ఉన్నాయి. 24 క్యారెట్లు పది గ్రాముల బంగారం ధర రూ.31,100 పలుకగా,22 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర రూ.28,820 గా ఉంది. కిలో వెండి ధర…

హైదరాబాద్

ప్రజలు మతసామరస్యాన్ని పాటించాలి: డీజీపీ

హైదరాబాద్‌: ప్రజలు మతసామరస్యాన్ని పాటించాలని డీజీపీ దినేశ్‌రెడ్డి విజ్ఞప్తి చేశారు. నగరంలో శాంతిభద్రతల సంరక్షణకు పౌరులు సహకరించాలని, పోలీసులు విధులకు ఆటంకం కలిగించవద్దని ఆయన సూచించారు.

ఆదిలాబాద్

అటో- లారీ ఢీ: నలుగురి మృతి

అదిలాబాద్‌ : జిల్లాలో జరిగిన రోడ్డు ప్రమాదంలో నలుగురు మరణించారు. అసిఫాబాద్‌ మండలంలోని మోతుగూడ వద్ద అటో లారీ ఢీకోనడంతో ప్రమాదం చోటు చేసుకుంది. ఈ ప్రమాదంలో నలుగురు మరణించగా, మృతుల్లో ఇద్దరు మహిళలు. కూడా ఉన్నారు.

జిల్లా వార్తలు

విధుల బహిష్కరించిన న్యాయవాదులు

వరంగల్‌ కలెక్టరేట్‌ : ఉస్మానియా విశ్వవిద్యాలయంలో విధ్యార్థి అత్మహత్య చేసుకున్న ఘటనపై న్యాయవాదుల ఐకాస అధ్వర్యంలో వరంగల్‌ జిల్లా కోర్టులో న్యాయవాదులు విధులు బహిష్కరించారు. తెలంగాణకు అనుకూలంగా నినాదాలు చేస్తూ కోర్టు ప్రధాన ద్వారం వద్ద బైఠాయించారు.